MMTS రెండో దశ ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు.
రెండో దశ లో అందుబాటులోకి వచ్చిన రూట్లు ఇవే..
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మరియు లింగంపల్లి నుంచి ఉందానగర్ మధ్యలో ఫేజ్ 2 సర్వీసులు నడవనున్నాయి. రెండు రూట్ల లో 40 సర్వీసులు up and down నడుస్తాయి. ఒక్కో రూట్ లో 10 సర్వీసులు అప్ 10 సర్వీసులు డౌన్ నడవనున్నాయు.
మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఎంఎంటీఎస్ ట్రైన్ సమయాలివే
- ఉదయం 6.05, 7.20, 8.50, 11.35, మధ్యాహ్నం 12.30, 3.30, సాయంత్రం 5.00, 6.50, రాత్రి 8.15, 10.10 గంటలకు ఎంఎంటీఎస్‌లు అందుబాటులో ఉంటాయి.
- సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు ఉదయం 5.45, 7.30, 8.40, 10.10, మధ్యాహ్నం 12.50, 1.45, సాయంత్రం 4.45, 6.15, రాత్రి 8.40, 9.30 గంటలకు ఎంఎంటీఎస్‌లు అందుబాటులో ఉంటాయి.
లింగంపల్లి నుంచి ఉందానగర్ (ఫలక్నామ మీదుగా) రూట్ లో వెళ్లే ట్రైన్ టైమింగ్
- లింగంపల్లి నుంచి ఉందానగర్‌కు ఉదయం 5.50, 6.30, 8.25, 9.05, 10.05, మధ్యాహ్నం 12.40, సాయంత్రం 4.35, 6.35, రాత్రి 9.15, 9.45 గంటలకు సర్వీసులు నడుస్తాయి.
- ఉందానగర్ నుంచి లింగంపల్లికి ఉదయం 4.00, 6.05, 6.55, 7.55 9.35, 10.30, 11.30, మధ్యాహ్నం 3.20, సాయంత్రం 5.45, రాత్రి 8.10 గంటలకు ఎంఎంటీఎస్‌లున్నాయి.
వీటితో పాటు సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ప్రారంభించడం జరిగింది.
ఇది చదవండి: సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ టైమింగ్స్, చార్జీల వివరాలు
Leave a Reply