➤చేయూత పథకం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపించింది. హైదరాబాద్ తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన విజయభేరి సభలో 6 గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు