ఏపి లో విడుదల అయిన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్ లో 65 శాతం,సెకండియర్ లో 75 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు ఫస్టియర్లో 58 శాతం,సెకండియర్ లో 68 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఈ మేరకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించారు.
ఇంటర్ ఫలితాలు కొరకు కింది లింక్ చెక్ చేయండి
మొత్తంగా ఫస్ట్ ఇయర్ లో 61%, సెకండ్ ఇయర్ లో 72% మంది ఉతీర్ణులు అయ్యారు. గత ఏడాది తో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది.
రికౌంటింగ్ మరియు సప్లిమెంటరీ తేదీలు ఎప్పుడంటే
ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కి అవకాశం కలించడం జరిగింది.
మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. First Year వారికి ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు ఉంటాయి. Second Year వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సప్లిమెంటరీ ఉంటుంది.
జూన్ 5 నుంచి 9 వరకు సప్లిమెటరీ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు సప్లిమెంటరీ ఫీజ్ చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.
కింది లింక్ ద్వారా సప్లిమెంటరి పరీక్షల పూర్తి టైం టేబుల్ చెక్ చేయండి





Leave a Reply