AP Inter Update : ఇంటర్ ఫలితాల పై కీలక అప్డేట్..రీకౌంటింగ్ మరియు సప్లిమెంటరీ తేదీలు ఇవే

–

–

inter supplementary dates

ఏపి లో విడుదల అయిన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్ లో 65 శాతం,సెకండియర్ లో 75 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు ఫస్టియర్లో 58 శాతం,సెకండియర్ లో 68 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఈ మేరకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించారు.

ఇంటర్ ఫలితాలు కొరకు కింది లింక్ చెక్ చేయండి

మొత్తంగా ఫస్ట్ ఇయర్ లో 61%, సెకండ్ ఇయర్ లో 72% మంది ఉతీర్ణులు అయ్యారు. గత ఏడాది తో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది.

రికౌంటింగ్ మరియు సప్లిమెంటరీ తేదీలు ఎప్పుడంటే

ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కి అవకాశం కలించడం జరిగింది.

మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. First Year వారికి ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు ఉంటాయి. Second Year వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సప్లిమెంటరీ ఉంటుంది.

జూన్ 5 నుంచి 9 వరకు సప్లిమెటరీ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు సప్లిమెంటరీ ఫీజ్ చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.

కింది లింక్ ద్వారా సప్లిమెంటరి పరీక్షల పూర్తి టైం టేబుల్ చెక్ చేయండి

2 responses to “AP Inter Update : ఇంటర్ ఫలితాల పై కీలక అప్డేట్..రీకౌంటింగ్ మరియు సప్లిమెంటరీ తేదీలు ఇవే”

  1. M.dileep Avatar
    M.dileep

    Internet 1st year

  2. K.nandhu Avatar
    K.nandhu

    Internet 1st year sa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page