NTR Bharosa Pension Scheme

#

NTR Bharosa Pension Scheme










All Device Apps: Device Play Store links:

పెంచిన పెన్షన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి - The details of increased or enhanced pension details are as below.


  • - ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు , వితంతువులు, నేత కార్మికులు, ట్రాన్స్ జెండర్, జాలర్లు, డప్పు కళాకారులు మొదలగు వారికి 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
    Enhancement of existing pension amount from Rs. 3,000/-month to Rs.4,000/- month for OAP, Widow, Weavers, Toddy Toppers, Fishermen, Single Women, Traditional Cobblers, Transgender, ART(PLHIV), Dappu Artists and pensions to Artists.

  • - దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 3000 పెన్షన్ను ఆరువేలకు పెంచడం జరిగింది.
    Enhancement of disabled persons pension from Rs. 3,000/- to Rs.6,000/- to all persons with disability and multi deformity Leprosy persons.

  • - పూర్తిగా అంగవైకల్యం చెంది మంచానికే పరిమితమైన వారికి ప్రస్తుతం ఇస్తున్న 5000 పెన్షన్ ఏకంగా 15 వేల కు పెంచడం జరిగింది.
    Enhancement of pension to fully disabled persons from Rs. 5,000/- to Rs.15,000/-.

  • - వివిధ దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న 5000 రూపాయల పెన్షన్ను 10000 రూపాయలకు పెంచడం జరిగింది.
    Enhancement of pension amount from Rs. 5,000/- to Rs. 10,000/- for persons with Chronic diseases viz., Bilateral Elephantiasis-Grade 4, Kidney, liver and heart transplant,
    CKDU not on Dialysis CKD Serum Creatinine of &5 mg, CKDU Not on Dialysis CKD estimated GFR &15 ml, CKDU Not on Dialysis CKD Small contracted kidney.

సవరించిన పెన్షన్ అమౌంట్ ఏప్రిల్ 2024 నుంచి వర్తిస్తుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి తొలిసారిగా జూలైలో అమౌంట్ ఇవ్వనున్న నేపథ్యంలో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు పెండింగ్ అమౌంట్ కూడా కలిపి జూలై నెలలో ఒకేసారి ₹7000 రూపాయలు అందచేస్తారు. దివ్యాంగులు మరియు ఇతర కేటగిరీల వారికి పెంచిన పెన్షన్ అమౌంట్ మాత్రమే జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది.
The enhanced pensions mentioned at (a) shall be payable from 1st April, 2024 disbursed from 1st July, 2024 along with
3 months arrears. Thus the amount to be disbursed under this category will be Rs.7000 in the month of July, 2024.
Thereafter Rs.4000/- month shall be disbursed every month as stated by the serp in its GO.









ANDHRA PRADESH PUBLIC HELPLINE NUMBER
Toll Free Number: 1902


S.NoCategoryPresent Rate of
Pensions (Rs.)
Enhanced
Pension Rate
(Rs.)
I. ENHANCEMENT OF PENSION FROM Rs.3000/- TO Rs.4000/-
1వృద్ధాప్య పెన్షన్30004000
2వితంతువు30004000
3చేనేత కార్మికులు30004000
4టాడీ టాపర్స్30004000
5మత్స్యకారులు30004000
6ఒంటరి మహిళలు30004000
7సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు30004000
8ట్రాన్స్ జెండర్30004000
9ART(PLHIV)30004000
10డప్పు కళాకారులు30004000
11కళాకారులకు పింఛన్లు30004000
II. ENHANCEMENT OF DISABLED PENSIONS FROM Rs 3000/- TO Rs.6000/-
12వికలాంగులు30006000
13బహుళ వైకల్యం కుష్టు వ్యాధి30006000
III. పూర్తి అంగవైకల్య వికలాంగుల పెన్షన్ Rs.15000/-
14పక్షవాతం వచ్చిన వ్యక్తి, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితం అయిన వారు500015000
15తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు మరియు ప్రమాద బాధితులు500015000
IV. CHRONIC DISEASES LIKE KIDNEY, THALASSEMIA etc.
16ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-Grade 4500010000
17కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి500010000
18CKDU Not on Dialysis CKD Serum creatinine of >5mg500010000
19CKDU Not on Dialysis CKD Estimated GFR <15 ml500010000
20CKDU Not on Dialysis CKD Small contracted kidney500010000
V. OTHER CATEGORIES
21CKDU on Dialysis Private10000No Change
22CKDU on dialysis GOVT10000
23సికిల్ సెల్ వ్యాధి10000
24తలసేమియా10000
25తీవ్రమైన హీమోఫిలియా (<2% of factor 8 or 9)10000
26సైనిక్ సంక్షేమ పెన్షన్5000
27అభయహస్తం500
28అమరావతి భూమి లేని నిరుపేదలు5000

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అర్హత ప్రమాణాలు



వృద్ధాప్య పెన్షన్ :
60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు.
గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు

వితంతు పెన్షన్ :
వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు.
భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి

వికలాంగుల పెన్షన్ :
40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు
సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు

చేనేత కార్మికుల పెన్షన్ :
వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు.
చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు

కల్లు గీత కార్మికుల పింఛన్ :
వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు.
ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

మత్స్యకారుల పెన్షన్ :
వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు.
మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు.

హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్ :
వయో పరిమితి లేదు.
ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు.

డయాలసిస్ (CKDU) పెన్షన్
వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5)
వయో పరిమితి లేదు.

ట్రాన్స్ జెండర్ పెన్షన్ :
18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు.
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు.

ఒంటరి మహిళ పెన్షన్ :
వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.
అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.)

డప్పు కళాకారుల పెన్షన్ :
వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు.
సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి.

చర్మకారుల పెన్షన్ :
వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు.
లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది.

అభయ హస్తం పెన్షన్ :
స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు.



Note:This page is specially designed for Pension Kanuka beneficiaries from Andhra pradesh

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #