తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అకాల వర్షాలతో కుదేలు అవుతున్న రైతాంగానికి మరొక షాకింగ్ వార్త.
మే ఆరు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తదుపరి రోజుల్లో అల్పపీడనం తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి మే 9 నాటికి అండమాన్ దీవుల వద్ద తుఫాను గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఢిల్లీలో వాతావరణ శాఖ IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరాలను వెల్లడించారు. మత్స్యకారులు ఎవరు సముద్రంలో బయటకు వెళ్లరాదని సూచించారు.
ఈ తుఫాను ఏర్పడిన తర్వాత దీనికి మోచా అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు. మొచా అనేది యెమెన్ దేశంలో ఒక ఓడరేవు పేరు. ఈ పేరు మీద ఈ తుఫానుకు నామకరణం చేయడం జరిగింది.
ఇప్పటికే అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.
అయితే వచ్చేవారం తుఫాను కారణంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు మరియు ఒడిశా తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Leave a Reply