కర్ణాటక లో ఎంతో రసవత్తరంగా హోరా హోరీ గా సాగిన ఎన్నికల పోరు కి సంబంధించి మే 10 న పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 71.77% పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా రామనగర లో 78.22% మరియు అత్యల్పంగా bbmp లో 48.63% మంది ఓటు వేశారు.
పోలింగ్ ముగిసిన కొద్ది సేపటికే దేశవ్యప్తంగా కీలక న్యూస్ ఏజెన్సీలు తమ exit polls అంచనాలను వెల్లడించాయి.
కన్నడ నాట ఈ సారి కాంగ్రెస్ మెజారిటీ పార్టీగా అవతరిస్తుందని దాదాపు అన్నీ exit polls వెళ్ళందించాయి. ఒకటీ రెండు సర్వే లు మినహా అన్ని సర్వేలు కాంగ్రెస్ కు 110 నుంచి 140 వరకు సీట్లను కట్టబెట్టాయి. అయితే ఈసారి కూడా కొంత మేర JDS కింగ్ మేకర్ గా అవతరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి సుమారు 20-25 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
Leave a Reply