ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఏపీ పోలీసు నియామక మండలి అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలు
- పీఎంటీ/ పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండలి పేర్కొంది. అభ్యర్థులకు మొత్తం నాలుగు పేపర్ల పరీక్ష ఉంటుంది.
- విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రస్తుతం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ) జరుగుతున్నాయి.
- ఇవి సెప్టెంబర్ 25 నాటికి పూర్తి కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
- సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
హాల్ టికెట్లు విడుదలైన వెంటనే మన Telegram చానల్ లో తెలియజేయడం జరుగుతుంది.. క్రింది లింక్ ద్వారా telegram చానల్ లో జాయిన్ అవ్వండి..
Leave a Reply