ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 8 న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష కి సంబంధించి ఫలితాలను ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా 297 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 83.38 శాతం హాజరు నమోదు అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
APPSC Group 1 Prelims Results
పై లింక్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల లిస్ట్ APPSC ప్రకటించింది.
అభ్యర్ధులను 1:50 నిష్పత్తి లో మెయిన్స్ కు ఎంపిక చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
APPSC GROUP 1 MAINS SCHEDULE
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 29 వరకు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇలా..
- తెలుగు పేపర్ ఏప్రిల్ 23
- ఇంగ్లీష్ పేపర్ ఏప్రిల్ 24
- పేపర్ 1 : జనరల్ ఎస్సే పరీక్ష ఏప్రిల్ 25
- పేపర్ 2 : హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా , ఆంధ్రప్రదేశ్ – ఏప్రిల్ 26
- పేపర్ 3 : పాలిటీ, రాజ్యాంగము, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ – ఏప్రిల్ 27
- పేపర్ 4 : ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ – ఏప్రిల్ 28
- పేపర్ 5 : సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణ సమస్యలు – ఏప్రిల్ 29
ఇందులో ఇంగ్లీష్ మరియు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్స్ గా ఉంటాయి.
ఈ నియామకం పూర్తి అయ్యాక సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Click below to download APPSC Mains Schedule and List of Papers
Leave a Reply