ఏపి లో Constable ప్రిలిమ్స్ కి సంబంధించి ఇప్పటికే ఫలితాలు వెలువడగ, మరోవైపు SI కి సంబంధించి రాత పరీక్ష కు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు.
అయితే చాలా మంది ఫ్రెష్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు అనగా ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయనే సందేహం మరియు క్వాలిఫై అయిన వారికి ఆందోళన ఉంటుంది.
అలాంటి వారి కోసం పూర్తి ప్రాసెస్ కింద ఇవ్వబడినది.
ఈవెంట్స్ కంటే ముందు ముఖ్యమైన సూచనలు
ముందుగా అభ్యర్థులు ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతునే మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ గా ఉంచుకోవాలి
అంతే కాకుండా మీ ముఖ్యమైన సర్టిఫికేట్ లను Xerox తీయించుకొని వాటి పైన గెజిటెడ్ అధికారి ద్వారా attestation చేయించుకోవాలి.
కనీసం రెండు జతల Xerox లు ఉంచుకోండి.
మీ అడ్మిట్ కార్డ్
ఆధార్ కార్డ్
టెన్త్ క్లాస్ సర్టిఫికెట్
ఇంటర్ సర్టిఫికేట్
SI అభ్యర్థులు అయితే డిగ్రీ సర్టిఫికేట్
అదే విధంగా reservation పొందుతున్న వారు సంబంధిత క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని జాగ్రత్తగా ఒరిజినల్ మరియు అట్టేస్ట్ చేసిన కాపీలను తీసుకు వెళ్ళాలి.
మీకు అడ్మిట్ కార్డ్ లో పేర్కొన్న venue మరియు లొకేషన్ కి సమయానికి వెళ్ళాలి. దూరం నుంచి వచ్చే వారు అయితే ఆ నగరానికి ముందు రోజు చేరుకొని హోటల్ లో బస చేయడం మంచిది. ముందు రోజు చాలా మంది సరిగా తినరు. అలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే మరుసటి రోజు చాలా సేపు గ్రౌండ్ లో కూర్చోవాల్సి వస్తుంది.
PMT మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్
ముందు గా మీరు venue కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒక చోట gather చేస్తారు. ఒక పెద్ద గ్రౌండ్ లో నే ఇది అంతా ఉంటుంది.
తర్వాత బ్యాచ్ ల వారీగా మమల్ని PMT – Physical Measurements అంటే కొలతలు తీసుకోవడానికి తీసుకు వెళ్తారు.
అక్కడే మీ డాక్యుమెంట్స్ ను కూడా వెరిఫై చేస్తారు.
PMT కంటే ముందు డాక్యుమెంట్స్ లను వెరిఫై చేస్తారు. ఏదైనా certificate సరిగా లేకపోతే వెనక్కి పంపిస్తారు. సరైన డాక్యుమెంట్స్ తీసుకొని మరొక రోజు రమ్మని చెప్తారు. కాబట్టీ అన్ని జాగ్రత్త గా తీసుకు వెళ్ళండి.
documents అన్ని సరిగా ఉంటే పక్కనే PMT కొలతలు తీసుకుంటారు.
పురుషులకు షర్ట్ లేదా T షర్ట్ లేకుండా చెస్ట్ కొలతలు తీసుకుంటారు.
Height , chest సరిగా ఉంటే, పురుషులకు చెస్ట్ expansion 5 cm ఉందా లేదా కూడా చూస్తారు.
అన్ని ఒకే అయితేనే మిమ్మల్ని PET ఈవెంట్స్ కి పంపిస్తారు .
PET ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు?
అభ్యర్ధులను పక్కనే ఉండే PET నిర్వహించే గ్రౌండ్ దగ్గరకు తీసుకు వెళ్తారు
బ్యాచ్ ల వారీగా పిలవడం జరుగుతోంది. అందరినీ గ్రౌండ్ లో వరుస క్రమంలో కూర్చో బెడతారు.
ముందుగా రన్నింగ్ ఈవెంట్ ఉంటుంది. ఇది అందరూ తప్పక క్వాలిఫై అవ్వాల్సిన ఈవెంట్. ఇందులో క్వాలిఫై అయితేనే తర్వాత ఈవెంట్స్ కి వెళ్ళవచ్చు.
అందరికీ ఒక నంబర్ తో Tag ఇస్తారు. అది అభ్యర్థులు ధరించాలి. దాని ఆధారంగానే అభ్యర్థుల రిజల్ట్ ని కెమెరాలు గుర్తిస్తాయి.
కావాల్సిన అన్ని ఈవెంట్స్ లో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులకు క్వాలిఫై అయినట్లు గా ఒక acknowledgement కాపీ ని ఇస్తారు. ఫెయిల్ అయిన వారికి కూడా ఇది ఇస్తారు .
ఇది PET PMT కి సంబంధించి పూర్తి ప్రాసెస్..
Note: ఇప్పటికే ఈ ఈవెంట్స్ కి అటెండ్ అయిన వారి experience ఆధారంగా ఈ డీటైల్స్ షేర్ చేయడం జరిగింది. ఇది కేవలం అవగాహన కు మాత్రమే. పూర్తి వివరాలకు అఫిషియల్ (అధికారిక) నంబర్స్ లేదా instructions ఫాలో అవ్వగలరు. ఈ ఆర్టికల్ లో ఏమైనా తప్పులు లేదా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయగలరు.
Leave a Reply