TSPSC GROUP 1 PRELIMS RESULTS – టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

TSPSC గ్రూప్ 1 ఫలితాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. హై కోర్ట్ నుంచి రిజల్ట్స్ విడుదల కు అనుమతి రావడం తో కమిషన్ వెంటనే ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం అర్ధరాత్రి టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో 503 పోస్టులకు గాను మెయిన్ 25,050
మందిని ఎంపిక చేసింది. మల్టీజోన్-2 లో దృష్టి లోపం కలిగిన (మహిళా అభ్యర్థులు సరైన సంఖ్యలో లేనం
1:50 నిష్పత్తి ప్రకారం అక్కడ ఎంపిక కాలేదని పేర్కొంది.

Download TSPSC GROUP 1 PRELIMS RESULTS

మెయిన్ పరీక్ష జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలిపింది.

మల్టీ జోన్ అందుబాటులో ఉన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుని కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ, క్రీడల కోటా రిజర్వేషన్ల మేరకు తొలిసారిగా ఆయా కేటగిరీ పోస్టు కు 1: 50 నిష్పత్తి మేరకు అభ్యర్థులను ఎంపిక
చేసినట్లు వెల్లడించారు.


TSPSC Group 1 Helpdesk Number

TSPSC GROUP 1 RESULTS Helpline – గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందేహాల నివృత్తికి కమిషన్ హెల్ప్ డెస్ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం
1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-2456 లేదా 040-23542185 లేదా 040-23542187 ఫోన్
నంబర్లలో సంప్రదించవచ్చు . helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యర్థులు సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page