గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కీలక మార్పులు

  • విధివిధానాలను తెలుసుకునేలా వెబ్సైట్లో నమూనా ప్రశ్నపత్రం
  • OMR లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు తక్కువ అర్హతలున్న వారికే స్క్రయిబ్లుగా అనుమతి
  •  నిర్ణీత సమయం దాటితే పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ

రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ ఏపీపీఎస్సీ కీలక ‘ మార్పులు చేసింది. గ్రూప్-1లో పేపర్-1, పేపర్ 2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్లైన్ ఓఎమ్మార్ ఆధా రిత పత్రాలతో పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్న లుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లే కాకుండా జిల్లాస్థాయి అధికారి ఒకరిని ప్రత్యేక పర్యవేక్షకునిగా నియమిస్తున్నారు.

కోడింగ్ తప్పయితే..

  • ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు అనుసరిం చాల్సిన విధివిధానాలకు సంబంధించిన సవివర సమాచారం ప్రశ్నపత్రాలు, ఓఎమ్మార్ పత్రాల్లో ముద్రించి ఉంటుంది. వాటిని ముందుగా తెలుసు కునేందుకు వీలుగా వాటి నమూనాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. దీనివల్ల అభ్యర్థికి సమయం కలసి రావడంతోపాటు పరీక్షపై ఒక అవ గాహన ఏర్పడుతుంది.
  • ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ బుక్ లెట్లపై కోడింగ్ సిరీస్ నంబర్లు సరిసమానంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు కోడింగ్ ఉంటే కనుక ఆ జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. అభ్యర్థి తన రిజిస్టర్ నంబర్ను ప్రశ్నపత్రం బుక్లె ట్పై నిర్ణీత స్థలంలోనే రాయాలి. అభ్యర్థులు హాలి కెట్లతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి.
  • అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఆ తరువాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు అనుమతిస్తారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 వరకు అవకాశమిస్తారు. తరువాత ఎవరినీ అనుమతించరు.
  • అభ్యర్థి దరఖాస్తు ఫారం లో బయోడేటా వివరాలను తప్పుగా సమ ర్పించి ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందు బాటులో ఉన్న నామినల్ రోల్స్ డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇన్విజిలేటర్ సంతకాన్ని తీసుకోవాలి.
  • అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం రెండు కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థి పైన ఉండే ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్కు అందించాలి. దిగువన ఉండే డూప్లికేట్ సమాధాన పత్రాన్ని తన రికార్డుకోసం తీసుకువెళ్లాలి. అభ్యర్థి ఏర్పాటు చేస్తారు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను ఎంపిక చేయరాదు. కేవలం ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇచ్చిన స్థలంలో నీలం లేదా నలుపు బాల్ పెన్నుతో బబుల్ చేయాలి. వైటనర్, మార్కర్, ఎరే జర్లను వినియోగించినా ఆ సమాధాన పత్రం చెల్లదు. అంధత్వం, రెండు చేతులకూ వైకల్యం, మస్తిష్క పక్షవాతం గల అభ్యర్థులకు స్క్రయిబర్లను అనుమతిస్తారు.
  • ఈసారి అత్యధికంగా 714 మంది స్క్రయిబర్లు కావాలని దరఖాస్తు చేశారు. అభ్యర్థు లు స్క్రయిబ్ను తామే తెచ్చుకుంటే వారికి ఆ పోస్టుకు నిర్ణయించిన అర్హత కన్నా తక్కువ అర్హత ఉండాలి. అభ్యర్థి తెచ్చుకున్న స్క్రయిబ్ అర్హుడు కాకుంటే చీఫ్ సూపరింటెండెంటు వేరొకరిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page