Pasu Bima Scheme Full Details

#

Pasu Bima Scheme Full Details





విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుద్ఘాతా లతో ఏటా వేలాది మూగ, సన్నజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కన్నబిడ్డల్లా సాకే యజమా నుల బాధ వర్ణణాతీతం. తమ కుటుంబ పోషణకు వీటిపైనే ఆధారపడి జీవించేవారు ఆ జీవాలు మరణిస్తే తల్లడిల్లిపోతారు. ఈ నేపథ్యంలో వివిధ ఘటనల్లో జీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పశు బీమా పథకం ద్వారా వారికి అండగా నిలవనుంది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ ప్రతిపా దనలను రూపొందిస్తోంది. పశువులు, మేకలు,గొర్రెలకు బీమాను వర్తింపజేయనుంది.

మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో.. వివిధ ఘటనల్లో తమ పశువులు, సన్నజీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వపరంగా బీమా పథకం అంటూ ఏమీలేదు. గతంలో బీమా పథకాలపై కాస్త అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగినవారు మాత్రమే సొంతంగా తమ జీవాలకు బీమా చేయించుకునేవారు. అవి చనిపోయిన ఏడాదికో రెండేళ్లకో.. అదీ బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితేకానీ అరకొరగా పరిహారం దక్కేది కాదు. నూటికి 95 శాతం మంది అవగాహన లేక, ఆర్థికభారం. కారణంగా బీమాకు దూరంగా ఉండేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పశు నష్టపరిహారం కింద 1.12 లక్షల రూ.58.02 పరిహారం అందించింది. ఇప్పుడు మరింత మందికి లబ్ది చేకూర్చే లక్ష్యంతో పశు బీమా పథకాన్ని తీసుకొస్తోంది.

50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు.. పశు బీమా పథకం కింద నాటు ఆవులు, గేదెలకు రూ.15 వేలు, మేలు జాతి గేదెలు, ఆవులకు రూ.30 వేల చొప్పున, సన్న జీవాలకు ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం ఇస్తారు. ఏడాదిలో ఒక రైతుకు గరిష్టంగా ఐదు పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. గతంలో ఏదైనా విపత్తు బారినపడి చనిపోతే ఒక్కో కుటుంబం పరిధిలో 20 సన్నజీవాలకు రూ.1.20 లక్షలకు మించకుండా పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు దాన్ని 50 జీవాలకు గరిష్టంగా రూ.3. లక్షల వరకు పరిహారం పొందేలా విస్తరిస్తున్నారు. గతంలో మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో మర ణిస్తేనే సన్నజీవాలకు పరిహారం ఇచ్చేవారు. ఇక నుంచి ఒక్క జీవి మరణించినా పరిహారం అందిస్తోం. అంతేకాదు తొలిసారి ఎద్దులు,దున్నపోతులతో పాటు కరువు బారిన పడిన పశువులకు కూడా బీమా వర్తింప చేయనున్నారు. అలాగే క్లైమ్ సెటిల్మెంట్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లిం చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #