Pedalandariki Illu Jagananna Colonies

Pedalandariki Illu Scheme





AP House site Pedalandariki Illu scheme updates

పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు పథకం వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్


పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలనీ సీఎం ఆదేశాలు ..ఇందులో ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్ 3 ఎంచుకున్న వారికి సత్వరమే ఇల్లు పార్టీ చేయాలనీ తెలిపారు
Latest Update
ఏపి లో ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అదనంగా రూ.35 వేలు రుణం 3 శాతం వడ్డీతో అందిస్తున్నట్లు సీఎం తెలిపారు .
► రూ.35 వేల రుణం ఇప్పటి వరకు తీసుకోని వారికి త్వరగా మంజూరు చేయాలని బ్యాంకర్ల సమావేశంలో ఆయా బ్యాంకులను కోరినట్లు తెలిపారు







HELPLINE NUMBER
States Covered : Andhra Pradesh
Any grievance number : 1902
Housing eMail Id : helpdesk.apshcl@apcfss.in

◼️ ఇంటి స్థలాల మంజూరు అర్హత ప్రమాణాలు

▪️ లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటూ తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి.

▪️మీరు ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ అయి పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగి కానీ అయి ఉండకూడదు

▪️ మీరు ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు అవ్వ రాదు. మీకు స్వతహాగా గాని లేదా మీ వంశపారపర్యంగా గాని ఇల్లు ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అర్హులు కారు!

▪️ 3 ఎకరాలు మాగాణి లేదా 10 ఎకరాలు ఆపై మెట్ట లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.

▪️ లబ్ధిదారుడు ఇంతకు పూర్వం ఏ ప్రభుత్వం ద్వారా ను ఇల్లు మంజూరు అయి ఉండరాదు.

▪️ లబ్ధిదారుడు గత ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలం కూడా మంజూరు అయి ఉండరాదు.

▪️ లబ్ధిదారు కుటుంబంలోని మహిళ అయి ఉండవలెను.

▪️ ఒకవేళ ఆ కుటుంబంలో మహిళా ఎవరూ కూడా లేకపోతే ఆ కుటుంబంలో పురుషుని పేరు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది

◼️ House site అప్లికేషన్ ప్రాసెస్:

▪️ మీరు తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఇల్లు లేని వారు అయి ఉండి పైన చెప్పిన ప్రమాణాలు చెల్లుబాటు అయినచో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

▪️ నూతన విధానం ప్రకారం ఇప్పుడు మీరు అప్లికేషన్ ని మీ సచివాలయం ద్వారా పొంది దానిని నింపి మీ గ్రామ వార్డు వాలంటీర్ కి అందజేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన 90 రోజులలో అర్హులైన వారికి ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుంది.

▪️ మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీయొక్క రేషన్ కార్డు నకలు మీ ఆధార్ కార్డు కాపీ తో పాటు మీకు ఏవైనా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే వాటి కాపీ కూడా జత చేయాల్సి ఉంటుంది.

◼️ మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు!

▪️మీరు సమర్పించిన అప్లికేషన్ మరియు సంబంధిత డాక్యుమెంట్స్ గ్రామ వార్డు వాలంటీర్ సంబంధిత అధికారికి సచివాలయంలో అందజేస్తారు.మీ అప్లికేషన్ కి సంబంధించి రిసిప్ట్ కూడా మీకు తీసుకొచ్చి ఇస్తారు.

▪️ ఆ విధంగా అందజేసిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు vadilation జరిగిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం మీ ప్రాంతానికి వీఆర్వో వస్తారు.

▪️ మీరు చెప్పిన వివరాలు సరిగా ఉండి మీరు అన్ని విధాలా ఇంటి స్థలానికి అర్హులు అని ఫీల్డ్ వెరిఫికేషన్ లో తేలితే అది తహసిల్దార్ దగ్గరికి వెళ్లి ఆ తర్వాత మీకు ఇంటి స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. దీనికోసం నిశితంగా పరిశీలన జరుగుతుంది. ఇంటి స్థలాల మంజూరుకు సంబంధించి కలెక్టర్ అప్రూవల్ సంబంధిత అధికారులు తీసుకుంటారు.

▪️ ఆ విధంగా కేటాయించిన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం రిజిస్టర్ చేసి మీకు అందించడం జరుగుతుంది.

▪️ అందించిన స్థలంలో తప్పనిసరిగా ఇల్లు కట్టాల్సి ఉంటుంది. ఐదేళ్ల వరకు కట్టిన ఇంటిని ఎవరి పేరు మీద బదిలీ గాని లేదా వేరే వారికి కానీ అమ్మడం చేయకూడదు.



▪️ అందించిన స్థలాలలో రాష్ట్ర ప్రభుత్వం 28.3 లక్షల ఇళ్లను జగనన్న కాలనీల రూపంలో నిర్మించుకొడానికి PMAY తో కలిసి లబ్ధిదారులకు సహాయం అందించనుంది..డిసెంబర్ 25న ప్రభుత్వం మొదటి దశ ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది.


◼️ హౌస్ సైట్ సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Smiley face






Note: పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు పథకం సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీరు ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు!

Share:
Share:
#

JOIN Our Telegram Group

  • #
  • #
  • #
  • #