►జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం..ప.గో జిల్లా, తణుకులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి..నేటి నుంచి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేత.
►ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి నేటి నుంచి పత్రాల పంపిణీ..₹16000 కోట్ల మేర లబ్ధి.
►గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఏప్రిల్ 2 వరకు పొడిగింపు.
ఏపి ప్రభుత్వం చేపట్టనున్న వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పేరును జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంగా మార్చినట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం గతంలో ఇంటి స్థలం, ఇల్లు కట్టుకుని దానిని కారణాంతరాల వల్ల అమ్మేసుకున్న వారు ఆఇంటిని వెనక్కు తీసుకునే విధంగా పథకం రూపొందించారు ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 1980 నుంచి 2011 మధ్య కాలంలో ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, పట్టా తీసుకుని ఇల్లు కట్టుకుని హౌసింగ్ కార్పొరేషన్ రుణాలు తీసుకున్న వారికి రూరల్ ప్రాంతంలో అయితే పదివేలు, మున్సిపాలిటీ పరిధిలో 15 వేలు, కార్పొరేషన్ పరిధిలో 20 వేలు చెల్లిస్తే ఓటీఎస్ పథకం వర్తిస్తుంది. పట్టా ఉండి ఇల్లు కట్టుకుని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని ఎవరికైనా ఇల్లు అమ్మేస్తే రూరల్ ప్రాంతంలో 20 వేలు, మున్సిపాలిటీల్లో 30 వేలు, కార్పొరేషన్లలో 40 వేలు జమచేసి ఓటీఎస్ కింద లబ్ది పొందవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు జరుగుతుందని, వచ్చే మూడు నెలల్లో ఈ పథకానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ది దారుల ఎంపిక పూర్తి కావాలని, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో MIG ప్లా్ట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా జగన్ కోరారు.
1980 నుంచి 2011 వరకు ఇళ్ల పట్టాలు మరియు రుణాలు పొందిన వారికి అవకాశం.
మూడు క్యాటగిరీలు గా ప్రభుత్వం విభజన
Category 1: పట్టా తీసుకుని, ఇల్లు కట్టుకుని -హోసింగ్ కార్పొరేషన్ వద్ద రుణాలు తీసుకున్న వారికి
Rural : 10 వేలు
Municipality : 15 వేలు
Corporation : 20 వేలు
చెల్లిస్తే గత బకాయిలు రద్దు చేసి ప్రభుత్వం OTS చేస్తుంది.
Category 2: పట్టా తీసుకుని, ఇల్లు కట్టుకుని -హోసింగ్ కార్పొరేషన్ వద్ద రుణాలు తీసుకుని ఆ ఇంటిని ఇతరులకు అమ్మి ఉంటె వారికి
Rural : 20 వేలు
Municipality : 30 వేలు
Corporation : 40 వేలు
చెల్లిస్తే ప్రస్తుత యజమానులకు అన్ని హక్కులు వర్తిస్తాయి.
Category 3: పట్టా తీసుకుని, రుణాలు తీసుకోకుండా వారు మాత్రమే ఆ స్థలం లో ఉంటె వారికి
a) కేవలం 10 రూపాయలకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది.
b) ఒకవేళ ఆ ఇంటిని ఇతరులకు అమ్మి ఉంటె వారికి
Rural : 10 వేలు,
Municipality : 15 వేలు,
Corporation : 20 వేలు ,
చెల్లిస్తే ప్రస్తుత యజమానులకు అన్ని హక్కులు వర్తిస్తాయి.
గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన ‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం(జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం)’’ 2021, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు OTS... డిసెంబర్ 21 నుంచి అమల్లోకి. గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు
పథకం పేరు | సంపూర్ణ గృహ హక్కు పథకం OTS 2021-22 |
ప్రారంబించినది | వైయస్ జగన్ మోహన్ రెడ్డి |
లక్ష్యం | గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు మరియు పూర్తి హక్కులు కల్పించేందుకు |
పోర్టల్ | PM Housing Portal |
ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రుణం ద్వారా ఇల్లు కట్టుకున్న వారికి ఇళ్ల పై పూర్తి హక్కులను కల్పిస్తూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కల్పిస్తూ రుణ గ్రహీతలకు One Time Settlement (OTS) కల్పించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రభుత్వం తేదీ 22.10.2021 GO:82 ను విడుదల చేయడం జరిగింది.
1983-84 నుంచి 2017-18 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 56,69,891 ఇళ్లను మంజూరు చేసి పూర్తి చేయటం జరిగింది ఇళ్ల మంజూరు లో భాగంగా సబ్సిడీ మరియు గ్రాండ్ తో పాటు లోన్ (ఋణం)ను కూడా ఇవ్వడం జరిగింది.తీసుకున్నప్పటి నుంచి ఋణం పెరుగుతూ వస్తూ ఉండటం వలన లబ్ధిదారు గృహం పై హక్కుల కోసం పేమెంటు సమయంలో ఎక్కువ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. లబ్ధిదారుడు పై ఉన్నటువంటి ఆ రుణము దానిపై వచ్చే వడ్డీని పూర్తిగా తొలగించేందుకు OTS మరలా తీసుకురావటం జరిగింది.
ప్రభుత్వం మొదట OTS ను 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. పొడిగింపులో భాగంగా మరలా GO. 47 తేదీ 7.3.2013లో తీసుకురావడం జరిగింది. అప్పట్లో తేదీ 31.3.2014 వరకు అవకాశం ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ఇప్పటివరకు రావాల్సిన మొత్తం బకాయిలు అసలు 9109.65 & అసలు 5151.65 కోట్లు, మొత్తం 14261.31 కోట్లు.
లబ్ధిదారుల పై రుణభారం పెరుగుతుండటం వలన రానున్న రోజుల్లో, గృహము పై పూర్తి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మరలా తీసుకురావడం జరిగింది.ఇందులో భాగంగా MD, APSHCL వారు OTS విధానం లో రుణ గ్రహీతలకు రీపేమెంట్ ఆప్షన్ మరల ఇచ్చేందుకు అవకాశం కల్పించారు.
Andhra Pradesh Assigned Land Prohibition Of Transfer Act 1977కు సవరణ అయినా AP Ordinance No.16 of 2021 ప్రకారం రుణ గ్రహీతలకు రుణము చెల్లించిన తరువాత వారికి హక్కు పత్రం కల్పించు అవకాశం ఉంటుంది.
1. రుణ గ్రహీతలు స్వతహాగా ఈ పథకాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా ఐచ్చికం (Optional).
2. ప్రభుత్వం నిర్ణయించిన స్లాబ్ విలువ కంటే ఋణం విలువ+దాని పై వడ్డీ తక్కువ ఉంటే ఎంత మొత్తం మో అంతే కడితే సరిపోతుంది.
ఉదా : గ్రామాల్లో స్లాబ్ విలువ 10000 అనుకుంటే ఋణం 3000 దానిపై వడ్డీ 2300 అనుకుంటే వారు కట్టవలసినది 3000+2300=5300 మాత్రమే..10000 కాదు.
3. రుణ గ్రహీతలు తో పాటుగా వారి యొక్క వారసులు ఈ పథకానికి అర్హులు.
( ఒక ఋణ గ్రహీతకు )
1. గ్రామాల్లో 10,000 రూపాయలు
2. మునిసిపాలిటీల్లో 15,000 రూపాయలు
3. నగర పంచాయతీల్లో ( Municipal Corporation ) లో 20,000 రూపాయలు
రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 21, 2021 నాడు ప్రారంభమవుతుంది.
Revenue(Land), Revenue (Registration), Panchayat Raj, Housing, GSWS Department
♦ ఇంటిపై సర్వ హక్కులు: గతంలో ఉన్న ‘నివసించే హక్కు’ స్థానంలో నేడు లబ్ధిదారునికి తన ఇంటిపై సర్వహక్కులు రానున్నాయి.
♦ లావాదేవీలు సులభతరం: ఇంటిపై పూర్తి హక్కును పొందడం ద్వారా లబ్ధిదారుడు సదరు ఇంటిని అమ్ముకోవచ్చు.. బహుమతిగా ఇవ్వవచ్చు.. వారసత్వంగా అందించవచ్చు.. అవసరమైతే తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం కూడా పొందవచ్చు.
♦ రూ.16 వేల కోట్ల లబ్ధి: దాదాపు 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రుణమాఫీ, మరో రూ.6 వేల కోట్ల మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుతో మొత్తం రూ.16,000 కోట్ల లబ్ధి కలగనుంది.
♦ నామమాత్రపు రుసుము: 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాలకు రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. అసలు, వడ్డీ ఎంత ఎక్కువ ఉన్నా గ్రామాల్లో కేవలం రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తం మాఫీ. చెల్లించాల్సిన వడ్డీ, అసలు మొత్తంపై రుసుం కంటే తక్కువ ఉంటే ఆ తక్కువ మొత్తానికే రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ కూడా పూర్తిగా మాఫీచేస్తూ పూర్తి హక్కులు కల్పించనున్నారు.
♦ ఇంటిపై సర్వహక్కులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఇంటి మీద పూర్తి హక్కులులేని దాదాపు 12 లక్షల మందికి కేవలం రూ.10కే సర్వహక్కులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోంది.
♦ 22–ఏ నుండి తొలగింపు: లబ్ధిదారుడి స్థిరాస్తిని గతంలో ఉన్న నిషేధిత భూముల జాబితా (22–ఏ నిబంధన) నుండి తొలగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుడు తన ఇంటిపై ఎలాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు.
♦ రిజిస్ట్రేషన్ ఇక సులభతరం: లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తిని గ్రామ–వార్డు సచివాలయంలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరంలేదు.
♦ లింకు డాక్యుమెంట్లతో పనిలేదు: ఈ పథకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏ విధమైన లింకు డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు
1. లబ్దిదారుడు తన ఇంటిపై freehold /సర్వహక్కులు కల్పించబడును
2. లబ్దిదారుడు తన రిజిస్టర్డ్ పత్రం తో బ్యాంకుల నుంచి ఋణం పొందుటకు గాని,తనఖా పెట్టుకొనుటకు గాని,అమ్ము కొనుటకు గాని లేదా బహుమతిగా ఇచ్చుకొనుటక్క న్యాయ పరమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
3. ఈ పధకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయములకు ఏవిధమైన లింక్ డాక్యుమెంట్ అవసరం లేదు
4. లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తి ని గ్రామ సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కార్యాలయంకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళవలసిన అవసరం లేదు
5. లబ్దిదారుడి స్థిరాస్తిని 22 (ఏ )నిభందన నుంచి తొలగంచబడుతంది. దీనివళ్ళ లబ్దిదారుడు ఏవిధమైన లావాదేవీలైన చేసుకోవచ్చు
6. రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. నామమాత్రపు రుసుముతో గ్రామ సచివాలయం నందు రిజిస్ట్రేషన్ చేయబడును.
ఈ పట్టా తీసుకొనట వలన దశాబ్దాల కాలంగా నివసిస్తున్న ఇంటిపై freehold /సర్వహక్కులు కల్పంచబడును మరియు తమ జీవన ప్రమాణాలను ఆర్థికంగా మెరుగు పరుచుకోవచ్చు . ఇల్లు అమ్ముకోకపోయినా ఈ పట్టాను బ్యాంకులో తనఖా పెట్టటకొని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. బ్యాంకులలో తనఖా పెట్టుకొనుట ద్వారా ఇంటిలోని ముఖ్యమైన అవసరాలకు , ఆరోగ్యపరమైన సమస్యలకు ,ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకోవటానికి ఆర్థికంగా ఉపయోగపడుతంది
1. 2014 సంవత్సరానికి ముందు ఇలాంటి పథకం ఒకటి ఉన్నప్పటికీ ఏవిధమైన టైటిల్ డీడ్(పట్టా)జారీచేయలేదు. ఈ పధకం ద్వారా మొట్టమొదటిసారి పట్టా జారీచేయబడుతోంది.
2.ఋణం పొందిన లబ్దిదారుడు ఋణం చెల్లించని వారిగా మిగల్పోవడమే కాకుండా ఆర్థిక సంస్థలనుంచి ఏవిధమైన ఆర్థిక వెసులుబాటు పొందలేకపోతారు.
3. ఈ పధకం వినియోగించుకొక పోవటం వలన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుక్క నన ఋణం మొత్తం పెరిగిపోవడం కాకుండా అధికమొత్తం చెల్లించాల్సి వస్తుంది
గతంలోని ఏకకాల పరిష్కారానికి (ots - జగనన్న సంపూర్ణ గృహ హక్కు)ప్రస్తుత పథకానికి మధ్య ఉన్న తేడా ఏంటిnew
1. లబ్దిదారుడు ఋణం చెల్లించనప్పటికి ఏవిధమైన రిజిస్టర్డ్ పట్టా ఇచ్చేవారు కాదు.అదేవిధంగా టైటిఎల్ డీడ్ యిచీవారు కాదు. ప్రస్తుత పథకం ద్వారా ఋణం చెల్లించిన రసీదు చూపంచిన వెంటనే స్థిరాస్తి సంబందించిన పట్టా ఇవ్వబడుతుంది. 2. గతంలో వడ్డీ ని మాత్రమే మాఫీ చేసేవారు,ప్రస్తుత పధకం ద్వారా ప్రాంతాన్ని బట్టి నిర్ణయించిన మొత్తానికి చెల్లిస్తే సరిపోతంది 3. గతంలో మండల కేంద్రంలో గల గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలకు వెళ్ళవలసి వచ్చేది. ప్రస్తుతం గ్రామ సచివాలయాలలో ఈ పధకం ప్రయోజనం పొందవచ్చు
ఈ పథకమునకు సంబందించిన మొత్తం పనులన్నీ గ్రామ/ వార్డు సచివాలయాలలోనే జరుగుతాయి. లబ్దిదారులు గుర్తింపు ,స్థిరాస్తికి చెందిన కొలతలు,రుసుం చెల్లింపు ,ఋణ చెల్లింపు పత్రం, రిజిస్టర్డ్ పత్రం (21 .12 .2021 ) నుండి పొందవచ్చు
ఒకే ఇల్లు నిర్మించిన పక్షం లో ఒకే వ్యక్తి లేదా హక్కుదారుడు స్వాధీనం లో ఇల్లు ఉంటే ఈ పథకం ద్వారా హక్కు దారులను గుర్తించి పథకాన్ని వర్తింప చేస్తారు ఒకే స్థలం లో రెండు ఇల్లులు నిర్మించుకొని గృహ ఋణం పొందిన వారిక క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇద్దరు హక్కు దారులకు పట్టా జారీ చేయడం జరుగుతంది
GO ఆధారంగా పట్టా (లేదా) స్వాధీన ధృవీకరణ పత్రంలో ఇవ్వబడిన భూమి మేరకు మాత్రమే హక్కులు కల్పించబడుతాయి. లోన్ ఉన్న వారి (Loanee cases) పత్రాలు మాత్రమే APSHCL కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.లోన్ లేని లబ్ధిదారుల నుండి పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది.
AE లాగిన్‌కి రికార్డును తిరిగి పంపడానికి PS లాగిన్‌లో ఎంపిక ఇవ్వబడింది, వారు లబ్ధిదారుని జిల్లాలోని GP/మునిసిపాలిటీలో దేనికైనా కేటాయించవచ్చు
కారణాన్ని సూచిస్తూ AEకి రికార్డును తిరిగి పంపడానికి PS లాగిన్‌లో ఎంపిక ఇవ్వబడింది.
రికార్డును కేటాయించిన పిఎస్‌కి రికార్డును తిరిగి పంపడానికి డిఎకు సౌకర్యం కల్పించబడింది. PS అదే విధంగా కొత్త సెక్రటేరియట్‌కి లేదా AEకి పంపవచ్చు
రికార్డును PSకి తిరిగి పంపడానికి ఎగువ ఎంపికను ఉపయోగించవచ్చు, వారు సరైన క్లస్టర్‌ను కేటాయించగలరు.
తీసుకోవడానికి నిర్మించిన ఇల్లు. వాలంటీర్ ఎంట్రీ యొక్క పార్ట్ Bలో అస్సలు నిర్మించబడని ఇల్లు 'గృహము ఉన్నాడ: లేదు'గా చూపబడుతుంది.
ప్రతిపాదిత OTS ITDA ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న చట్టాలు/నిబంధనలను ఏ విధంగానూ అధిగమించదు. చట్టానికి విరుద్ధంగా బదిలీ జరిగిన సందర్భాల్లో , లోపాన్ని రికార్డ్ చేయడానికి DA/VRO లాగిన్‌లో ప్రొవిజన్ ఇవ్వబడుతుంది .
ఇష్టపడనట్లు అదే రికార్డ్ చేయవచ్చు. లబ్ధిదారుల నుండి అటువంటి ప్రతిస్పందనను నమోదు చేయడానికి DA లాగిన్‌లో ప్రొవిజన్ అందించబడుతుంది. అయితే, లబ్ధిదారుని సుముఖత స్థితిని మార్చడానికి సదుపాయం అందించబడుతుంది .
పత్రం రకం నిబంధన మార్పు ప్రారంభించబడుతుంది. అయితే, డాక్యుమెంట్ మార్పును ప్రతిపాదించడానికి ముందు , VRO ఏ డాక్యుమెంట్ కలిగి ఉందో AE హౌసింగ్ నుండి తనిఖీ చేయవచ్చు
ఏదైనా చర్యను ప్రతిపాదించడానికి ముందు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌తో తనఖా పెట్టారు. లోన్ లేని లబ్ధిదారుల కోసం, మంజూరు పొందిన పత్రం రకాన్ని లబ్ధిదారుల నుండి సేకరించాలి
లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై ముద్రించబడే ప్రస్తుత వివరాలు కనుక పాత సర్వే నంబర్ల కంటే ప్రస్తుత ఫీల్డ్ నుండి సేకరించాల్సి ఉంటుంది .
రుణం పొందని లబ్ధిదారుల విషయంలో బహుశా ఈ సమస్య తలెత్తవచ్చు. రుణ లబ్ధిదారుల విషయంలో, అందుబాటులో ఉన్న పట్టాల డేటా నమోదు చేయబడింది కాబట్టి లోపం సంభవించే అవకాశం తగ్గుతుంది. లోన్ కానివారి విషయంలో, డేటా ఎంట్రీకి ఒక ఎంపిక అందించబడుతుంది, దీనిలో, అలాంటి సందర్భాలను నమోదు చేయవచ్చు.