House Hold Spilt Option

#

House Hold Spilt Option





రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న పిల్లలు లేదా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఉండటం తో ఇతరులకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు .. అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒకవేళ అనర్హత ఉన్న కుటుంబ సభ్యునికి పెళ్లి అయితే , కుటుంబం నుంచి రెండు అంతకంటే ఎక్కువ జంటలను వేరు చేసే household స్ప్లిట్ ఆప్షన్ ను ప్రభుత్వం సచివాలయము navasakam లో కల్పించింది. పెళ్లైన కుటుంబాలను విడదీసే ఆప్షన్ ను పైలట్ ప్రాజెక్టు కింద గత వారం పరిశీలించిన ప్రభుత్వం , మంగళవారం నుంచి అన్ని సచివాలయాలలో అందుబాటులోకి తేనుంది.

రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న పిల్లలు లేదా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఉండటం తో ఇతరులకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు ..

అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒకవేళ అనర్హత ఉన్న కుటుంబ సభ్యునికి పెళ్లి అయితే , కుటుంబం నుంచి రెండు అంతకంటే ఎక్కువ జంటలను వేరు చేసే household స్ప్లిట్ ఆప్షన్ ను ప్రభుత్వం సచివాలయము navasakam లో కల్పించింది.

పెళ్లైన కుటుంబాలను విడదీసే ఆప్షన్ ను పైలట్ ప్రాజెక్టు కింద గత వారం పరిశీలించిన ప్రభుత్వం , మంగళవారం నుంచి అన్ని సచివాలయాలలో అందుబాటులోకి తేనుంది.

ఎవరు అర్హులు :

ప్రస్తుతం మొదటి దశలో పెళ్లి అయిన జంటలు మాత్రమే అర్హులు. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పెళ్లి అయిన జంటలు ఉంటె వారిని విడదీయవచ్చు.

రెండో దశలో వితంతువులు (స్త్రీ/పురుషులు) , సింగిల్ పేరెంట్ ఉన్నవారికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విజయనగరం జిల్లా గరివిడి మండలం లో అందుబాటులో ఉంది.

ఎం డాకుమెంట్స్ కావాలి ?

  1. Marriage Certificate
  2. Rice Card
  3. Aarogyasri Card
  4. Family Member Certificate
  5. Passport
  6. Aadhaar Card

Proof of Separate living: Field verification

స్ప్లిట్ చేసాక బెనిఫిట్స్ ఏంటి ?

రేషన్ కార్డు తో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న వారికి అందనున్నాయి

  • Ration Card Split
  • New Ration Card for divided houses
  • Govt schemes for eligible family

House Hold Mapping Splitting Option Enabled

HOUSE HOLD MAPPING SPLITTING చేసుకోవడానికి Married Case's కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది

ఒక HOUSE HOLD MAPPING లో ఇద్దరు వివాహం జరిగిన కుటుంబాలు ఉన్నప్పుడు మాత్రమే SPLITTING చేసుకోవడానికి అవుతుంది

కేవలం ఒకే HOUSE HOLD లో తల్లి; తండ్రి తో పాటు వివాహం జరిగిన రెండు కేస్ లు ఉండాలి అటువంటి కేస్ లు కి మాత్రమే ఈ SPLIT వర్తిస్తుంది.

● ఈ సర్వీస్ల కి ఎటువంటి చార్జీలు లేవు.
● అప్లికేషన్ ప్రక్రియ లో రెండు HOUSE HOLD నుండి Authentications అవసరం ఉంటుంది. (బయోమెట్రిక్ / OTP ఆప్షన్ ).
● ప్రస్తుతం డ్రాఫ్ట్ మాన్యువల్ మాత్రమే ఇవ్వడం జరిగింది.

Proof of marriage (any one document mandatory)

  1. Marriage Certificate
  2. Rice Card
  3. Aarogyasri Card
  4. Family Member Certificate
  5. Passport
  6. Aadhaar Card

Proof of Separate living: Field verification


● FINAL PROCESS MANUAL లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

Household Mapping Splitting Process -హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ప్రక్రియ

అన్ని ప్రభుత్వ పథకాలకి ప్రామాణికంగా తీసుకునే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడమైతే జరిగింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ విభజనకు సంబంధించి ఆప్షన్ను కొత్తగా ఇవ్వటం జరిగినది. ఈ ఆప్షన్ ను Household Split అని పిలవటం జరుగుతుంది.

ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ద్వారా ఎవరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే రెండు పెళ్లి అయిన కుటుంబాలు ఉండి, విడివిడిగా జీవిస్తున్నారో వారు రెండు హౌస్ ఓల్డ్లుగా విభజించే అవకాశం ఉంది. ఈ సర్వీసు గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంటుంది. 

రైస్ కార్డు విభజనకు మరియు ఈ సర్వీస్ కు ఎటువంటి సంబంధం లేదు. రైస్ కార్డులో విడివిడిగా ఉండి హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఒకే కుటుంబంలో ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా ఈ ఆప్షన్ ద్వారా రెండు హౌస్ హోల్డ్ గా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా ప్రభుత్వం అందించే పథకాలు గాని, సర్వేలు గానీ హౌస్ హోల్డ్ మెంబర్ల ప్రాప్తికి అందించడం జరుగుతుంది.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వీస్ కు రైస్ కార్డ్ (రేషన్ కార్డ్) సర్వీస్ కు సంబంధం లేదు. రైస్ కార్డ్ లేకపోయినా లేదా కేన్సిల్ అయ్యిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ అయ్యాక మరలా తిరిగి అప్లయ్ చేసుకోవాలి.కావున ముందు హౌజ్ హోల్డ్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం.

Household Mapping Splitting Case 1

హౌస్ హోల్డ్ లో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఒక మ్యాపింగ్ లో ఉంటే నేరుగా సచివాలయం లో సర్వీస్ అప్లయ్ చేసుకోవచ్చు. 

Household Mapping Splitting Case 2

హౌస్ హోల్డ్ లో తల్లి, తండ్రి, కొడుకు,  ఒక మ్యాపింగ్ లో ఉండి కోడలు వాళ్ళ పుట్టింటి హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే రెండు టాస్క్ లు చేయవలసి ఉంటుంది.టాస్క్ 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.దీనికి గాను మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం. అదే విధంగా DA లాగిన్ లో మ్యారెజీ మైగ్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ అప్లయ్ చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి. DA తదుపరి PS లాగిన్ అంతిమంగా ఎంపిడిఒ లాగిన్ లో ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు హౌజ్ హోల్డ్ లో కోడలు add అవుతారు. అప్పుడు ఈ ఫ్యామిలీ case 1 లా మారుతుంది. Verify procedure of case1.

Household Mapping Splitting Case 3

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు, కోడలు ఉంటే వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇంకా అవకాశం ఇవ్వలేదు. కానీ త్వరలోనే అవకాశం ఇస్తారు.

Household Mapping Splitting Case 4

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు తో కలిసి హౌజ్ హోల్డ్ లో ఉంటూ కోడలు వాళ్ళు పుట్టింటి వాళ్ళతో హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే,రెండు టాస్క్ లు చేయవలసి ఉంటుంది.టాస్క్ 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.దీనికి గాను మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం. అదే విధంగా DA లాగిన్ లో మ్యారెజీ మైగ్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ అప్లయ్ చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి. DA తదుపరి PS లాగిన్ అంతిమంగా ఎంపిడిఒ లాగిన్ లో ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు హౌజ్ హోల్డ్ లో కోడలు add అవుతారు. అప్పుడు ఈ ఫ్యామిలీ case 3 లా మారుతుంది. Verify Case 3.

Household Mapping Splitting Case 5

విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఒక హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే కోర్టు ద్వారా పొందిన డివోర్స్ డిక్రీ ఉంటే విడి విడి హౌజ్ హోల్డ్ లుగా add అవ్వచ్చు.తల్లి, తండ్రి, కొడుకు, కోడలు లను ప్రామాణికం గా తీసుకున్నాం కానీ ఇక్కడ కూతురు అల్లుడు, తమ్ముడు మరదలు, ఇలా అన్నీ రిలేషన్స్ కు ఈ case లు వర్తిస్తాయి.

Service Type for Household Mapping Splitting

ఈ సర్వీసు క్యాటగిరి B కింద కు వస్తుంది.

Application Fee for Household Mapping Splitting

సర్వీసుకు సంబంధించి ఎటువంటి ఫీజు ఉండదు.

SLA Period for Household Mapping Splitting

సర్వీసు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపు అందించడం జరుగుతుంది.

Required Documents for Household Mapping Splitting

సర్వీసు పొందుటకు కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది.

  1. వివాహ ధ్రువీకరణ పత్రము
  2. రైస్ కార్డు
  3. ఆరోగ్యశ్రీ కార్డు
  4. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
  5. పాస్పోర్టు
  6. ఆధార్ కార్డు

రెండు కుటుంబాలు విడిగా ఉంటున్నందుకు ప్రూఫ్ :

  1. ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది.

Work Flow for Household Mapping Splitting

PS Gr-VI(DA) /WEDPS --> WEA / WWDS --> PS / WAS --> MPDO / MC

Application Process for Household Mapping Splitting

PS Gr-VI(DA) / WEDPS 

AP Seva పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి. Home Page లొ GSWS Services లొ Splitting Of Household Members Application Form పై క్లిక్ చేయాలి.

Basic Details లొ దరఖాస్తు దారుని Aadhaar Number ఎంటర్ చేసాక Pre-Fill పై క్లిక్ చేస్తే Automatic గ 

  • Citizen Name, 
  • Gender, 
  • Caste,
  •  DOB, 
  • Door No, 
  • District, 
  • Mandal/Municipality, 
  • Village / Ward Sachivalayam, 
  • PIN Code వివరాలు వస్తాయి . 

మిగతా వివరాలు అనగా 

  • Father / Husband Name, 
  • Religion, 
  • Qualification, 
  • Marital Status, 
  • Mobile Number, 
  • Post Office, 
  • Postal Village ను ఎంటర్ చేసి, 

Continue పై క్లిక్ చేయాలి.

Application Form లొ దరఖాస్తు దారుని ఆధార్ ఏ హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉందొ ఆ కుటుంబ సభ్యుల అందరి వివరాలు మరియు వారి eKYC స్టేటస్ తో చూపిస్తుంది. కుటుంబ విభజనకు తప్పనిసరిగా అందరి eKYC స్టేటస్ Yes (Y) అని ఉండాలి. No (N) అని ఉంటే అప్లికేషన్ చేయటానికి అవ్వదు. N ఉన్నవారు వాలంటీర్ వద్ద వారి GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్ లొ eKYC చేపించుకోవాలి.

Select Head of Family లొ ఆ కుటుంబ లొ ఎక్కువ వయసు ఉన్న మహిళకు(Female) సెలెక్ట్ చేసుకోవాలి. అలా లేనించే ఎక్కువ వయసు ఉన్న పురుషుడును(Male) సెలెక్ట్ చేసుకోవాలి.ఎవరిని అయితే సెలెక్ట్ చేస్తారో వారు కింద లిస్ట్ లొ Self గ చూపించటం జరుగుతుంది.

Service Type లొ Marriage Split సెలెక్ట్ చేసుకోవాలి.

Marital Status లొ అందరి వివాహ స్థితి ను ఎంచుకోవాలి.

Relationship లొ Head తో సంబంధం ఎంచుకోవాలి. ఇక్కడ వారు Male / Female ప్రకారం Relationship చూపించటం జరుగును. 

Split Type లొ ఎవరు అయితే పాత హౌస్ మాపింగ్ లొ ఉండాలి అనుకుంటున్నారో వారిని Existing Household లొ కొత్తగా హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉండాలి అనుకున్నవారిని Marriage అని సెలెక్ట్ చేయాలి.ఇక్కడ ఒక సారి ఒక కుటుంబం మాత్రమే విభజన కు అవకాశం ఉంటుంది. తరువాత Preview Split పై క్లిక్ చేయాలి.

Household 1 Member Details మరియు Household 2 Member Details చూపితుంది. రెండిట్లో కుటుంబ పెద్దను ఎంచుకోవాలి. ఇక్కడ ఎక్కువ వయసు కలిగిన Female వారు లేనిచో Male Gender ను HOF గా ఎంచుకోవాలి. Relationships HOF అనుగుణంగా ఎంచుకోవాలి.

Household 1 & 2 లొ ఎవరిది అయిన ఒకరి ఆధార్ నెంబర్ తో బయోమెట్రిక్ / OTP (ఆధార్ ను లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వస్తుంది ) తో eKYC చెయ్యాలి .

Documents Upload సెక్షన్ లొ Household 1 & 2 కు సంబందించి ముందుగా చెప్పుకున్న వాటిలో ఎదో ఒకటి ఎంచుకొని , అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డులను కూడా అప్లోడ్ చెయ్యవచ్చు. అందులో C/O లొ వివరాలు Split కు అనుగుణంగా ఉంటే సరిపోతుంది. Show Payment పై క్లిక్ చేయాలి. రసీదు ను సిటిజెన్ కు అందజేయాలి. అందులో ఉండే అప్లికేషన్ తో సిటిజెన్ వారి అప్లికేషన్ ను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

WEA/WWDS 

AP SEVA పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి. HOME PAGE లొ HH నెంబర్ తో అప్లికేషన్ కనిపిస్తుంది ఆ నెంబర్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తు దారుని 

  • Basic Details,
  •  Present Address, 
  • Applicant Details, 
  • List Of Documents 

ఒక సారి సరి చుకోవాలి.

వెరిఫికేషన్ కు సంబంధించి నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు కనబడతాయి వాటికి అనుగుణంగా అన్నీ సరిగా ఉంటే YES అని సరిగా లేకపోతే NO అని సెలక్ట్ చేయాలి.

అడిగే ప్రశ్నలు 

  1. Whether Marriage Certificate/ Rice Card/Arogyasri Card/Family Member Certificate/Passport/Aadhaar for the resultant Household 1 is valid?
  2. Whether Marriage Certificate/ Rice Card/Arogyasri Card/Family Member Certificate/ Passport/Aadhaar for the resultant Household 2 is valid?
  3. Whether at least 2 alive married couples are present in the existing Household?
  4. Whether the two married couples live separately

Remarks లొ అప్లికేషన్ తరువాత స్థాయికి పంపించాలి అనుకుంటే Recommended అని రిజెక్ట్ చేయాలి అంటే Not Recommended అని సెలెక్ట్ చేయాలి.Check Box టిక్ చేసి Verification Document Upload చేసి Forward పై క్లిక్ చేయాలి.

PS/WAS 

పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రెటరీ వారి లాగిన్ కొత్తగా క్రియేట్ చేయవలసి ఉంటుంది. ముందుగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఆమోదం కొరకు ఉపయోగించే లాగిన్ దీనికి పనికిరాదు. మ్యారేజ్ సర్టిఫికెట్ లాగిన్ అనేది పంచాయతీ DDO లాగిన్ పై ఉంటుంది. కానీ ఇప్పుడు క్రియేట్ చేయబోయే లాగిన్ అనేది ఆ సచివాలయ పంచాయితీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ గా పనిచేస్తుంది ఉదాహరణకు WEA/WWDS వారి లాగిన్ లా ఉంటుంది.

User name :

SECCODE-PS/WS@apgsws.onmicrosoft.com

Password :

Re$t@Ap@SECCODE 

SECCODE - SAACHIVALAYAM CODE

లాగిన్ అయిన వెంటనే హోం పేజీలో Request List లొ WEA/WWDS వారు ఆమోదం చేసిన లిస్ట్ చూపిస్తుంది. అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. అవసరం మేరకు ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత WEA/WWDS వారి రిమార్కులను వెరిఫికేషన్ చేసిన తరువాత WEA/WWDS వారి లాగిన్ లొ ప్రశ్నలు చూపిస్తాయి. అన్ని సరిగా ఉంటే Yes అని సరిగా లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. WEA/WWDS వారి రిమార్క్ సరిగా ఉంటే Whether The WEA/WWDS Remarks Are Valid లొ Yes అని సరిగా లేనిచో No అని సెలెక్ట్ చేయాలి. Verification Document Upload చేసి అన్ని సరిగా ఉంటే Recommended అని లేనిచో Not Recommended అని సెలెక్ట్ చేసి చెక్ బాక్స్ టిక్ చేసి ఫార్వర్డ్ చేయాలి.

MPDO / MC 

MPDO / MC వారి AP Seva పోర్టల్ లాగిన్ లొ అప్లికేషన్ పై క్లిక్ చేసాక WEA/WWDS & PS/WAS వారి రిమార్కులను పరిగణించి ఆమోదం తెలుపవలసి ఉంటుంది. Digital Signature ద్వారా తుది ఆమోదం చేయవలసి ఉంటుంది.

Application Status :

Step 1 : కింద లింక్ పై క్లిక్ చేయాలి. 

Step 2 : Service Request Status Check అనే ఆప్షన్ లొ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.

Step 3 : Application Status చూపిస్తుంది. Green Color లొ ఉంటే అవి పూర్తి అయినట్టు అర్థము. Orange Color లొ ఉంటే వారి వద్ద పెండింగ్ లొ ఉన్నట్టు అర్థము.

Note :

  1. Widow
  2. Widower
  3. Single Parent House Hold Split Option 

త్వరలో ఇవ్వటం జరుగును. అందుకు గాను కుటుంబంలో ఒక జంట ఉండవలెను. 

House hold Split - Single Old Age Person


కొత్తగా House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది.

ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది.

ఈ ఆప్షన్ ఉపయోగించటానికి House Hold మాపింగ్ లో కనీసం ఒక జంట ఉండాలి.

Single House Hold Mapping ద్వారా విభజన కేవలం 01 వ్యక్తికి మాత్రమే అవుతుంది.

ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారి వయసు 60 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండాలి మరియు Widow / Widower అయ్యి ఉండాలి.

ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. మరియు డాక్యుమెంట్ సెక్షన్ లో Spouse Death Certificate / Rice Card/ Widow Pension Card అప్లోడ్ చేయాలి.

మాపింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు Marriage split, Divorce Split ముందు నుంచే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #