➤ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆహార పట్టిక విడుదల
PM Poshan Goru Mudda Mid day Meals scheme
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అంటే ఏమిటి?
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం.
ఇదివరకే ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి జగన్నన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉన్న మధ్యాహ్నం భోజన మెనూలోనూ మార్పులు చేయబడ్డాయి.
ఈ పథకం ద్వారా, వారమంతా ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఆహారంలో పోషక దృక్పథాన్ని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
Monday | కూరగాయల పలావ్, కోడిగుడ్డుకూర, వేరుశనగ బెల్లం చిక్కి |
Tuesday | పులిహార, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ |
Wednesday | కూరగాయల అన్నం, ఆలూకుర్మా ఉడికించినకోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి |
Thursday | సాంబార్ బాత్/లెమన్ రైస్, టమోట పచ్చడి, ఉడికించన కోడిగుడ్డు |
Friday | అన్నం, ఆకుకూర పప్పు, ఉడికంచిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి |
Saturday | ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్ పొంగల్, |
➤ విద్యార్థుల హాజరు ప్రధానోపాధ్యాయుల అనుమతితో విద్యార్థులకు సరిపోవునట్లు బియ్యం, గుడ్లు, చిక్కి
➤ వంట సహాయకులు భోజనానికి ముందు వంటపాత్రలు, గిన్నెలు, గ్లాసులు శుభ్రపరచవలెను.
➤ పిల్లలు భోజనం తిన్న తర్వాత గిన్నెలు, గ్లాసులు, భోజనశాలను శుభ్రపరచవలెను.
➤ వంట నిర్వాహకులు వంట నిర్వాహణనకు ముందు స్నానం చేసి యూనిఫాం తప్పక ధరించ శుభ్రంగా వుండవలెను
➤ వంట చేసే ప్రదేశం శుభ్రంగా వుంచవలెను.