AP Free Sand Policy

#

AP Free Sand Policy





08.07.2024 నుండి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఇసుక స్టాక్యార్డలో ఉచిత ఇసుక విధానం పునఃప్రారంభించబడుతుంది. సరఫరాలు స్థిరీకరించబడే వరకు ప్రతి వినియోగదారుడు గరిష్టంగా రోజుకు 20MTని పొందేందుకు అనుమతించబడతారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక సరఫరా చేయబడుతుంది. పాలసీ ప్రకారం, ఆన్లైన్ చెల్లింపు ద్వారా కార్యకలాపాల ఖర్చు,చట్టబద్ధమైన లెవీలు మరియు పన్నులు మినహా ఎటువంటి ఆదాయ వాటాను వసూలు చేయకుండా ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. DMG వెబ్సైట్ - "AP Sand Management System". ద్వారా వినియోగదారుడు స్టాక్ యార్డుల జాబితా, పరిమాణం లభ్యత మరియు విక్రయ ఛార్జీల వివరాలను చూడవచ్చు.

ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే?

✓ ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.
✓ అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు.
✓ ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి.
✓ స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.
www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు.

#

గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే ప్రస్తుత ఇసుక ధరలు (టన్ను ఇసుక కి) ఈ విధంగా ఉన్నాయి.

Sand Delivery Post Audit Questions & Answers

𝗤𝟭 : ఈ ఇసుక డెలివరీ మీ సచివాలయం పరిధిలో జరిగిందా?
Yes / No
𝗤𝟭.𝟭 : ఈ ఇసుక డెలివరీ మీ సచివాలయం పరిధిలో జరగకపోతే!
𝗢𝗽𝘁𝗶𝗼𝗻 𝟭 : ఇసుక బుకింగ్ చేసిన gps లొకేషన్ మా సచివాలయం పరిధిలో లేదు
𝗢𝗽𝘁𝗶𝗼𝗻 2 : మా సచివాలయం పరిధిలో ఇసుక డెలివరీ అవలేదు
𝗢𝗽𝘁𝗶𝗼𝗻 3 : మా సచివాలయం పరిధిలో ఉన్నా ఈ gps లొకేషన్ లో ఎటువంటి నిర్మాణం జరగటం లేదు
𝗤𝟮 : ఉచిత ఇసుక విధానం పై సంతృప్తి గా ఉన్నార ?
Yes / No
𝗤𝟯 : మీరు ఇసుక కోసం పట్టిక లో నిర్ణయించిన ధరనే చెల్లించారా ?
Yes / No
𝗤𝟰 : ఇసుక రవాణా కోసం డ్రైవర్ గారికి పట్టక లో నిర్ణయించిన ధరనే చెల్లించార ?
Yes / No
𝗤𝟱 : మీ రసీదు లో చూపించినంత ఇసుక ఇవ్వడం జరిగిందా ?
Yes / No
𝗤𝟲 : మీకు ఇచ్చిన ఇసుక నాణ్యత బాగుందా ?
Yes / No
ఫోటో తీసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #