Welcome to District Selection committee DSC
What is DSC? డీఎస్సీ అనగా ఏమి?
డీఎస్సీ అనగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఏవైతే జిల్లాల వారీగా కలెక్టర్ నేతృత్వంలో భర్తీ అయ్యే ఉద్యోగాలని డిస్టిక్ సెలక్షన్ కమిటీ నియామకాలు అంటారు. ఇక జనరల్ గా చెప్పుకోవాలంటే డీఎస్సీ అనగా టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు.
ఆయా జిల్లాలోని టీచర్ ఉద్యోగాల కి 80 శాతం ఆ జిల్లా వారికి మిగిలిన 20 శాతం నాన్ లోకల్ వారికి కేటాయించడం జరుగుతుంది.
Who is eligible for DSC? డీఎస్సీ కి అసలు ఎవరు అర్హులు?
డీఎస్సీ పరీక్ష రాయాలంటే ముందుగా మీరు గ్రాడ్యుయేషన్ తో బీఈడీ లేదా డిఈడి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పైన తెలిపిన డిఈడి లేదా బిఈడి మరియు టెట్ ఎగ్జామ్ మీరు గాని పూర్తి చేసినట్లయితే మీరు డీఎస్సీ రాయడానికి అర్హులు.
What is the Age limit for DSC? డీఎస్సీ వయసు పరిమితి ఎంత?
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షకు హాజరు కావాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నోటిఫికేషన్లో ఇవ్వబడుతుంది అయితే సహజంగా 44 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక రిజర్వేషన్ కలిగిన వారికి అదనంగా వయోపరిమితి కి ఇవ్వబడుతుంది.
What are the various Jobs filled under DSC? డీఎస్సీ లో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి?
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్ష ద్వారా దిగువ ఇవ్వబడిన ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
సెకండరీ గ్రేడ్ టీచర్స్ వీళ్ళనే ఎస్జిటి అంటాము.
స్కూల్ అసిస్టెంట్స్
లాంగ్వేజ్ పండిట్స్
పి ఈ టి
గతంలో ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఈడీ పూర్తి చేసిన వారికి అర్హత ఉండేది కానీ ఇప్పుడు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా ఈ అర్హత ఉంది.
ఇకపోతే ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. దీంట్లో రిజర్వేషన్ ని బట్టి ఇ అర్హత మార్కులు ఉంటాయి. ఉదాహరణకు ఓసి కి 60%, బీసీ అభ్యర్థులకు 50% , ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు కావాల్సి ఉంటుంది.
when are we expecting next DSC notification? 949 ఖాళీలతో డీఎస్సీ 2020 నోటిఫికేషన్ రానున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ తెలుగు, పి ఈ టి వ్యాయామ ఉపాధ్యాయులు, భాషా పండితులు మరియు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పోస్టుల కోసం ఈ నియామకం ఉన్నట్లు సమాచారం.దీనికి సంబంధించి సరికొత్త సిలబస్ తో త్వరలో టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
Andhra Pradesh DSC Full Syllabus
Copyright © 2019 by studybizz.com