YSR Yantra Seva Pathakam వైస్సార్ యంత్ర సేవ పథకం పథకం

#



వైయస్ఆర్ యంత్ర సేవ పథకం పథకం 2024: YSR Yantra Seva Scheme 2024: Apply Online, Eligibility & Beneficiary List






వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న పంపిణీ చేయనున్నారు. గుంటూరులో జరిగే కార్యక్రమంలో ఆర్‌బీకే, క్లస్టర్‌ స్థాయిలోని యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ హార్వెస్టర్లను అందిస్తారు. ఈ పథకం ద్వారా తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రపరికరాలు లభిస్తాయని, చిన్న, సన్నకారు రైతులతోపాటు పెద్ద రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుందని వివరించింది. ‘రాష్ట్రంలో రూ.2,106 కోట్ల వ్యయంతో విత్తు నుంచి కోత వరకు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. ఆర్‌బీకే స్థాయిలోని 10,750 యంత్ర సేవా కేంద్రాలకు ఒక్కోదానిలో రూ.15 లక్షల విలువైన పరికరాలు సమకూరుస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లోని 1,615 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఒక్కోచోట రూ.25లక్షల విలువైన కంబైన్డ్‌ హార్వెస్టర్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి అద్దె, సంప్రదించాల్సిన వారి వివరాలను రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శిస్తారు. యాంత్రీకరణలో భాగంగా దుక్కిదున్నే యంత్రాలు, దమ్ము, చదును చేసేవి, వరినాటు, నూర్పిడి, కోత, ఎరువులు, సస్యరక్షణ, కలుపుతీత తదితర పరికరాలు ఉంటాయి’ అని వివరించింది. ‘40శాతం రాయితీపై సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నాం. ఆప్కాబ్‌, డీసీసీబీ ద్వారా 50% రుణంగా తక్కువ వడ్డీకే ఇస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం రూ.806 కోట్లను రాయితీగా ప్రభుత్వం కేటాయించింది. రైతుల ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొంది.



YSR యంత్ర సేవా పథకం 2024

ఈ పథకాన్ని 2021 అక్టోబర్ 26న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం 1,720 మంది లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో 25.5 రూపాయలను బదిలీ చేస్తుంది. 2024 లో ఈ పథకాన్ని జూన్ న రైతులకు వ్యవసాయ యంత్రాలను అద్దెకు అందించనున్నారు
.

AP యంత్ర సేవా రైతు అర్హతలు

రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితి కంటే తక్కువగా ఉండాలి.
ఈ పథకం కింద రైతులు వ్యవసాయ యంత్రాలను పొందుతారు.

AP YSR యంత్ర పథకానికి కావలసిన పత్రాలు

దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డ్.
ఆదాయ ధృవీకరణ పత్రం.
శాశ్వత నివాస రుజువు.
మొబైల్ నంబర్.
పాస్‌పోర్ట్ సైజు ఫోటో

Ecrop లో నమోదు తప్పనిసరి గా చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. నమోదు చేసిన వారికి నగదు జమ చేయడం జరుగుతుంది.రైతులు యంత్రాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అద్దెకు పొందవచ్చు


#

JOIN Our Telegram Group

  • #
  • #
  • #
  • #