➤ పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
➤ ఈ పథకం కోసం మొదటగా ₹13000 - 15000 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయింపు
➤ 13.5 కోట్ల మంది పేద దేశస్థులు మరియు మహిళలు పేదరికపు శృంఖలాల నుండి విముక్తి పొంది కొత్త మధ్యతరగతిలోకి ప్రవేశించారు: శ్రీ నరేంద్ర మోదీ
సంప్రదాయ చేతివృత్తులు చేసుకునే వారికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం "పీఎం విశ్వకర్మ యోజన" పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సిసిఇఏ ఆమోదాన్ని తెలియజేసింది.
పీఎం విశ్వకర్మ యోజనకు సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలను కేంద్రం చేసింది.
సంప్రదాయంగా చేతివృత్తులు చేసుకుంటూ జీవనాధారం సాగించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సరికొత్త పథకమే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం. సుమారు 13,000 కోట్ల రూపాయలు వ్యయంతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు , అనగా 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారు మరియు హస్తకళల నిపుణులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. చేతివృత్తుల చేసుకునే వారు, హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు మరియు సేవల యొక్క నాణ్యత ను మరియు వాటి వ్యాప్తి ని మెరుగు పరచి, ఆయా విశ్వకర్మలను దేశీయంగా మరియు విదేశీ వేల్యూ చైన్ తో ముడిపడేటట్లు చేయడం అనేది కూడా ఈ పథకం యొక్క ధ్యేయం గా ఉంది. తద్వారా విదేశీయంగా కూడా వీరి ఉత్పత్తులు అమ్ముడు అయ్యే అవకాశం ఉంటుంది.
పిఎమ్ విశ్వకర్మ పథకం లో భాగంగా, చేతివృత్తుల వారి కి మరియు హస్తకళల నిపుణుల కు
✓పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను ఇస్తారు
✓ ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణాన్ని 5 శాతం సబ్సిడీ వడ్డీ తో ఇస్తారు.
✓ ఈ పథకం లో భాగం గా నైపుణ్య శిక్షణ, పనిముట్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ మరియు మార్కెటింగ్ సంబంధించి సహాయ సహకారాలను కూడా అందజేయడం జరుగుతుంది.
పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే
(1) వడ్రంగులు;
(2) పడవల తయారీదారులు;
(3) ఆయుధ /కవచ తయారీదారులు;
(4) కమ్మరులు;
(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;
(6) తాళాల తయారీదారులు;
(7) బంగారం పని ని చేసే వారు;
(8) కుమ్మరులు;
(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;
(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;
(11) తాపీ పనివారు;
(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;
(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);
(14) నాయి బ్రాహ్మణులు;
(15) మాలలు అల్లే వారు;
(16) రజకులు;
(17) దర్జీలు మరియు;
(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు