
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో పన్నులు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
▶ సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి
▶ సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు
▶ సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువు పెంపు
▶ డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు
▶ రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగింపు
▶ విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గింపు
▶ చదువులు, వైద్యంపై టీసీఎస్ 5శాతం నుంచి 2శాతానికి తగ్గింపు
▶ మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గింపు
▶ చిన్న పన్ను చెల్లింపు దారుల కోసం ప్రత్యేక పథకం
2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.
సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్జీకి మినహాయింపు
మైక్రో అవెన్స్‌పై పన్ను తగ్గింపు
పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గింపు
కంపెనీల బైబ్యాక్ విధానాలకు శరాఘాతం
కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22శాతం పన్ను
నాన్ కొర్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30శాతం పన్ను
2047 వరకూ డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలీడే
ట్యాక్స్ హాలిడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం
గతేడాదితో పోలిస్తే 0.1శాతం తగ్గిన ద్రవ్యలోటు
2026-27లో ద్రవ్యలోటు 4.3శాతానికి తగ్గించాలని లక్ష్యం
ఖగోళశాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచడమే లక్ష్యంగా చర్యలు
నేషనల్ లార్జ్సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఏర్పాటు
హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్-2 ప్లానిటోరియం ఏర్పాటు
తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.లక్షా 4వేల కోట్ల నిధులు
సెన్సెక్స్: 219 పాయింట్ల లాభంతో 82,489.45 వద్ద కొనసాగుతోంది
నిఫ్టీ: 51.77 పాయింట్ల లాభంతో 25,341.25 వద్ద ట్రేడవుతోంది
విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గింపు
చదువులు, వైద్యంపై టీసీఎస్ 5శాతం నుంచి 2శాతానికి తగ్గింపు
మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గింపు
చిన్న పన్ను చెల్లింపు దారుల కోసం ప్రత్యేక పథకం
దివ్యాంగులకు చేయూతగా దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన
మానసిక వ్యాధుల చికిత్సకు నిమ్స్హన్స్. రాంచీ, తేజ్పుర్లలో ఏర్పాటు.
తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు
పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సహకాలు
వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం
తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం
కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు ప్రోత్సాహకాలు
జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు
గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్ కోసం ప్రత్యేక పథకం
మౌలిక సదుపాయాల రంగంలో పనిచేసే కూలీలకు ఉపయోగపడేలా నిధుల కేటాయింపు
జాతీయ జలరవాణా కార్యక్రమంలో భాగంగా తూర్పు–పశ్చిమాల అనుసంధానం
వారసత్వ పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ
టైక్స్‌టైల్ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం
టైక్స్‌టైల్ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు
నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి
ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడాభివృద్ధి
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత
సంప్రదాయ వైద్యంలో పరిశోధనలపై దృష్టి
తూర్పు భారతంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్
ఆతిథ్య రంగంలో జాతీయ సంస్థ స్థాపన
20 పర్యాటక ప్రాంతాల్లో 10,000 గైడ్ల నియామకం
సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2,000 కోట్లు కేటాయింపు
‘స్వయం సమృద్ధ భారతం’ పేరుతో రూ.2,000 కోట్ల ఫండ్ ఏర్పాటు
ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్ఎంఈలకు మరింత చేయూత
ఆయుష్ కేంద్రాల అప్‌గ్రేడేషన్
సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు
ప్రైవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం
యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు శుభవార్త
భారత స్టాక్ మార్కెట్లో ఎన్నారై పెట్టుబడుల పరిమితి పెంపుకు అవకాశం
మూలధన వ్యయం రూ.12.2 లక్షల కోట్లుకి పెంపు
5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి
5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనా సంస్థల ఏర్పాటు
కొత్తగా డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు
వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారాల ఏర్పాటు
ముంబయి – పుణె
పుణె – హైదరాబాద్
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
దిల్లీ – వారణాశి
వారణాశి – సిలిగుడి
పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం
దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు
జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ
గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయింపు
ఎలక్ట్రానిక్ రంగ విస్తరణకు మరిన్ని నిధులు కేటాయింపు
కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కీలక ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక పథకం
దేశంలో మూడు కొత్త రసాయన పార్కుల స్థాపన
భవన నిర్మాణ రంగంలో నిర్మాణ పరికరాల అభివృద్ధిపై దృష్టి
కంటైనర్ తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం
జాతీయ ఫైబర్ విధానం దిశగా కీలక అడుగులు
జౌళి రంగ విస్తరణ, ఆధునీకరణ, ఉపాధి సృష్టి కోసం మరిన్ని చర్యలు
— కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్) వెలికితీత, శుద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రకటించిందని
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశీయంగా ఈ కీలక ఖనిజాల ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారాన్ని
తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
* ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ
* రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం
* ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 మూడు కొత్త విద్యా సంస్థల స్థాపన
* కర్తవ్యభవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్
* నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
* అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చర్యలు
* 2025 ఆగస్టు తర్వాత 350కి పైగా సంస్కరణలు అమలు
* ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
* జీఎస్టీ, లేబర్‌కోడ్ తదితర రంగాల్లో కీలక సంస్కరణలు
— కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా ‘యువ శక్తి బడ్జెట్’ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అదే దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. దేశం సుమారు 7 శాతం వృద్ధి రేటుతో స్థిరంగా ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు.
కొత్త పన్ను విధానంలో మధ్యతరగతికి ఊరట కలిగించే మార్పులు చేసే అవకాశం.
ఉద్యోగ సృష్టి, మహిళలు, యువత, రైతుల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం.



