❁❁ యూనియన్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు ❁❁LIVE
ఎఫ్‌డీఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా
ఎఫ్‌డీఐ పెట్టుబడులు పెరిగాయి. విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగం.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తాం
సంస్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణాలు
ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి.
పన్ను చెల్లింపుదారుల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం.
కొత్త పన్ను విధానంలో రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నులేదు.
పిల్లల ఆరోగ్యం కోసం ఇంధ్రధనుస్సు కార్యక్రమం.
భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్‌నకు ప్రత్యేక కారికాడర్
మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు.
దేశ తూర్పు ప్రాంతాన్ని నూతన అభివృద్ధి రథంగా మారుస్తున్నాం..
డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తోంది
2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం.
అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తోంది
కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతోంది.
విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించాం
దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు
పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం
నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తాం.
ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం
స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు
లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నాం
పరిశోధన, సృజనాత్మకతకు రూ.లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం
మౌలిక వసతుల రంగం 11.1శాతం వృద్ధితో రూ.11లక్షల 11 వేల 111 కోట్ల కేటాయింపు
మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం.
రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్.
బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తాం.
వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2కోట్ల ఇళ్ల నిర్మాణం
ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు...
9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు
మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తాం
మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం.
జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం.
రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్.
బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తాం.
జీడీపీకి ఈ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది.
స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం.
గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చాం.
జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చాం.
ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం.
ప్రజల ఆదాయం 50శాతం పెరిగింది.
ప్రపంచదేశాలు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
భారత్ మాత్రం వాటికి అతీతంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది
అన్ని రంగాల్లో ఆర్థికవృద్ధి కనబడుతోంది.
ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించాం.
యువతకు ముద్రా యోజనతో రూ.25లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చాం.
జీఎస్టీ వంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయి.
క్రీడల్లో సాధించిన పతకాలు యువతలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నాయి.
మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాం
4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం.
11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాం.
వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువ జోడించే విధానాలు తెచ్చాం.
స్కిల్ఇండియా మిషన్‌తో కోటి 40లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం
* గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం.
* 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28శాతం పెరిగింది.
* పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ.34లక్షల కోట్లు అందించింది.
* 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించాం
* రూ.2.20లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం
కేంద్ర బడ్జెట్ 2024కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది.
* పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి.
* బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
* 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించేందుకు కృషి చేస్తున్నాం అని నిర్మల సీతారామన్ ప్రకటన