❁❁ యూనియన్ బడ్జెట్ 2023 ముఖ్యాంశాలు ❁❁LIVE
సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం.
* వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు.
* వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం.
* వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
* రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.
* పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం.
* ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటకు చేయూత.
* చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం
కేంద్రం ప్రకటించిన కొత్త పన్ను శ్లాబులు ఇవే..
* 0-రూ.3 లక్షలు: పన్ను లేదు
* రూ.3 లక్షలు-రూ. 6లక్షలు: 5% పన్ను
* రూ.6 లక్షలు-రూ.9 లక్షలు: 10% పన్ను
* రూ.9 లక్షలు-రూ. 12 లక్షలు: 15% పన్ను
* రూ.12 లక్షలు-రూ.] 5 లక్షలు: 20% పన్ను
* రూ.15 లక్షలు-ఆపైన ఆదాయం: 30% పన్ను
అటు ITR ప్రాసెసింగ్ వ్యవధిని 20-45 రోజుల నుంచి 15 రోజుల లోపుకు తగ్గిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆదాయపు పన్ను రాయితీ పరిమితి నీ 7 లక్షలకు పెంచిన కేంద్రం. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కొత్త టాక్స్ చట్ట పరిధిలో ఎంచుకునే వారికి ఇది వర్తిస్తుంది
స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
దేఖో ఆప్నా దేఖ్ పథకం ప్రారంభం
దేశంలో 50 టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
పీఎం కౌశల్ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ.
5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటులు
దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్ల నిర్మాణం
మహిళల కోసం కొత్త స్కీమ్
ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు. కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, అక్కడ సాగు రంగానికి రూ.5,300 కోట్లు
36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.
పీఎం కౌశల్ యోజనలో భాగంగా యువతకు శిక్షణ.
కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానం.
కోస్టల్ షిప్పింగ్‌కు ప్రోత్సాహం.
బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.13.5లక్షల కోట్ల కేటాయింపు.
కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు.
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు.
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
2030 కల్లా 5 MMT హైడ్రోజన్ తయారీ. లద్ధాఖ్‌లో పునరుత్పాదక ఎనర్జీ కోసం రూ.20,700 కోట్లు. నేషనల్ హైడ్రోజన్ కార్యక్రమానికి రూ.19,700 కోట్లు.
పట్టణ మౌలిక సౌకర్యాలకు రూ.10వేల కోట్ల నిధి.
బ్యాటరీల నిల్వ కేంద్రాల్లో 4వేల మెగావాట్లు.
సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకం.
ఈ-కోర్టులకు రూ.7వేల కోట్లు
జాతీయ సహకార డేటా బేస్‌కు రూ.2516 కోట్లు
* ఫిన్‌టెక్ సర్వీసుల కోసం డిజిలాకర్ కేవైసీ మరింత సరళీకరణ.
* ప్రయోగశాలల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధులు
* 5జీ అప్లికేషన్ల తయారీకి 100 ప్రయోగశాలలు
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* మేక్ ఇన్ ఇండియా, మేక్ ఎ వర్క్ మిషన్ ప్రారంభం
* స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహం, రిస్క్ తగ్గించేందుకు కృతి
* ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపుకార్డు పాన్ నెంబర్
కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి మోదీ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్లో నిధులు పెంచింది. గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.
తాజా బడ్జెట్లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నాం. రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.2.04లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం. అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం. మూలధనం కింద రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.
ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు. ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తాం. కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూత అందిస్తాం.
దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్ కాలేజ్‌లకు అనుమతి. త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తాం
‘శ్రీఅన్న’ పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు
* పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ.6వేల కోట్లు. వ్యవసాయ రుణాలు రూ.20లక్షల కోట్ల వరకూ లక్ష్యం.
* రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు. పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు.
సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తున్నాం.
* వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు.
* వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం.
* వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
* రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.
* పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం.
* ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటకు చేయూత.
* చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం
భారత దేశం తలెత్తుకుని నిలబడుతోంది. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 11.7కోట్లతో టాయ్‌లెట్స్ నిర్మాణం చేపట్టాం. 220 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను అందించాం. 44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోంది. విశ్వకర్మ కౌశల్ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నాం. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోంది.