TS TET 2023 - తెలంగాణ టెట్ 2023

#

తెలంగాణ టెట్ 2023 - TS TET 2023








ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) అభ్యర్థులకు అధికారులు ఊరట కల్పించారు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకున్నా, తప్పులు దొర్లినా.. ఆ తప్పులను సరిచేసి, ఫొటో అతికించి గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరిస్తే పరీక్షకు అనుమతించాలని అధికారులు తాజాగా సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెల 12న రాష్ట్రంలో టెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష పేపర్‌-1 కోసం 3,51,468 మంది, పేపర్‌-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక TS TET 2023 పరీక్ష జూన్ 12న జరగనుంది. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జూన్‌ 6 నుంచి https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది.
ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ మార్పులు చేసింది. ఈ పరీక్ష ఫలితాలు (TS TET Results 2023) జూన్ 27న ఫలితాలు విడుదలవుతాయి. కాగా టెట్‌ పరీక్ష జూన్‌ 12 న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. పేపర్‌-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్‌ -1 ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి 12 గంటలకు, పేపర్‌-2 పరీక్ష మద్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రెండు పేపర్లు రాసే అభ్యర్ధులు ఆయా సమయాల్లో పరీక్షకు హాజరుకావచ్చు.
కాగా ఈసారి రెండు పేపర్లకు హాజరయ్యేవారి సంఖ్య అధికంగా ఉంది. పేపర్‌ 1, పేపర్‌ 2లకు కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష అనంతరం ఫలితాలు మే 27న వెల్లడవుతాయి.
తెలంగాణలో 80,039 పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులున్నాయి. 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


For any Technical problems in Online Application Submission and Download of Hall-Tickets Call Ph:040-23120340, 040-23120433 (Call Time: 10.10 A.M to 1.00 P.M & 1.20 P.M to 05.20 P.M on working days) For any Domain related issues Call Ph:8121010310, 8121010410

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #