StudyBizz is an online educational, jobs & services platform.We provide Education materials or open source content or any other useful content. These are meant to help beneficiaries intended for and not for any misuse of the content. Misuse of any content or in any form shall make himself/herself liable for any further consequences!






history

Pedalandariki Illu House Site Allocation

పేదలందరికీ ఇల్లు ఇంటి స్థలాల మంజూరు పూర్తి సమగ్ర సమాచారం!



New WhatsApp group for Govt schemes [only for public]: 

ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30 వరకు పొడిగించిన ప్రభుత్వం. ***   House site మంజూరు పత్రం అనగా సాంక్షన్ ఆర్డర్ మీ ఆధార్ నంబరు ఉపయోగించి ఇక్కడ తెలుసుకోండి:Click here to check   ***   రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారుల పూర్తి లిస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి: :Click Here to download     * * * *    ఇంటి స్థలాలు మరియు ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం. మరో రెండు వారాల పాటు కొనసాగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమం.        Welcome to Studybizz website. For all latest Educational , Jobs and Sachivalayam videos subscribe our YouTube channel     * * * *    Follow studybizz on Instagram , Facebook & Telegram @studybizz     ***     ధన్యవాదాలు! Thank You! Please Visit Again!


◼️ఆధార్ తో ఇంటి స్థలానికి సంబంధించిన స్టేటస్ ఇక్కడ తెలుసుకోండి

Smiley face


◼️జగనన్న కాలనీలు ఇళ్ల నిర్మాణం పూర్తి మార్గదర్శకాలను ఈ వీడియో ద్వారా చూడవచ్చు

Smiley face

◼️జగనన్న కాలనీలు ఇళ్ల నిర్మాణం పూర్తి మార్గదర్శకాలను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Smiley face


◼️ AP Housing beneficiaries search

Smiley face


◼️PMAY ప్రధాన మంత్రి ఆవాస్ యోజన బెన్ఫిషరీస్ సెర్చ్:

Smiley face


◼️జగనన్న కాలనీలు ఇళ్ల నిర్మాణం వాలంటీర్ మరియు సిబ్బంది రోల్ ఏంటో ఈ వీడియో ద్వారా వీక్షించవచ్చు.

Smiley face



◼️ ఇంటి స్థలాల మంజూరు అర్హత ప్రమాణాలు

▪️ లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటూ తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి.

▪️మీరు ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ అయి పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగి కానీ అయి ఉండకూడదు

▪️ మీరు ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు అవ్వ రాదు. మీకు స్వతహాగా గాని లేదా మీ వంశపారపర్యంగా గాని ఇల్లు ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అర్హులు కారు!

▪️ 3 ఎకరాలు మాగాణి లేదా 10 ఎకరాలు ఆపై మెట్ట లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.

▪️ లబ్ధిదారుడు ఇంతకు పూర్వం ఏ ప్రభుత్వం ద్వారా ను ఇల్లు మంజూరు అయి ఉండరాదు.

▪️ లబ్ధిదారుడు గత ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలం కూడా మంజూరు అయి ఉండరాదు.

▪️ లబ్ధిదారు కుటుంబంలోని మహిళ అయి ఉండవలెను.

▪️ ఒకవేళ ఆ కుటుంబంలో మహిళా ఎవరూ కూడా లేకపోతే ఆ కుటుంబంలో పురుషుని పేరు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది

◼️ House site అప్లికేషన్ ప్రాసెస్:

▪️ మీరు తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఇల్లు లేని వారు అయి ఉండి పైన చెప్పిన ప్రమాణాలు చెల్లుబాటు అయినచో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

▪️ నూతన విధానం ప్రకారం ఇప్పుడు మీరు అప్లికేషన్ ని మీ సచివాలయం ద్వారా పొంది దానిని నింపి మీ గ్రామ వార్డు వాలంటీర్ కి అందజేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన 90 రోజులలో అర్హులైన వారికి ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుంది.

▪️ మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీయొక్క రేషన్ కార్డు నకలు మీ ఆధార్ కార్డు కాపీ తో పాటు మీకు ఏవైనా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే వాటి కాపీ కూడా జత చేయాల్సి ఉంటుంది.

◼️ మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు!

▪️మీరు సమర్పించిన అప్లికేషన్ మరియు సంబంధిత డాక్యుమెంట్స్ గ్రామ వార్డు వాలంటీర్ సంబంధిత అధికారికి సచివాలయంలో అందజేస్తారు.మీ అప్లికేషన్ కి సంబంధించి రిసిప్ట్ కూడా మీకు తీసుకొచ్చి ఇస్తారు.

▪️ ఆ విధంగా అందజేసిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు vadilation జరిగిన తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం మీ ప్రాంతానికి వీఆర్వో వస్తారు.

▪️ మీరు చెప్పిన వివరాలు సరిగా ఉండి మీరు అన్ని విధాలా ఇంటి స్థలానికి అర్హులు అని ఫీల్డ్ వెరిఫికేషన్ లో తేలితే అది తహసిల్దార్ దగ్గరికి వెళ్లి ఆ తర్వాత మీకు ఇంటి స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. దీనికోసం నిశితంగా పరిశీలన జరుగుతుంది. ఇంటి స్థలాల మంజూరుకు సంబంధించి కలెక్టర్ అప్రూవల్ సంబంధిత అధికారులు తీసుకుంటారు.

▪️ ఆ విధంగా కేటాయించిన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం రిజిస్టర్ చేసి మీకు అందించడం జరుగుతుంది.

▪️ అందించిన స్థలంలో తప్పనిసరిగా ఇల్లు కట్టాల్సి ఉంటుంది. ఐదేళ్ల వరకు కట్టిన ఇంటిని ఎవరి పేరు మీద బదిలీ గాని లేదా వేరే వారికి కానీ అమ్మడం చేయకూడదు.



▪️ అందించిన స్థలాలలో రాష్ట్ర ప్రభుత్వం 28.3 లక్షల ఇళ్లను జగనన్న కాలనీల రూపంలో నిర్మించుకొడానికి PMAY తో కలిసి లబ్ధిదారులకు సహాయం అందించనుంది..డిసెంబర్ 25న ప్రభుత్వం మొదటి దశ ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది.


◼️ హౌస్ సైట్ సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Smiley face




Note: ఏ విధంగా ఇంటి స్థలానికి అప్లై చేయాలి.. వాటి అర్హత ప్రమాణాలు ఏవిధంగా అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తారు ఇత్యాది వివరాలు ఇక్కడ వివరించబడ్డాయి. ఇంటి స్థలాల అర్హుల కొరకు రూపొందించబడిన వెబ్ పేజ్ ఇది!