► 𝐍𝐅𝐒𝐀 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: దేశ వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం ద్వారా 2028 వరకు ఉచిత రేషన్ పంపిణీ
► ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం కి రూపాయి ఇక చెల్లించాల్సిన అవసరం లేదు.
జాతీయ ఆహార భద్రత చట్టం (nfsa) అనేది భారత దేశంలోని 1.2 బిలియన్ల జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల మందికి అఅనగా 81.35 కోట్ల మందికి సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత పార్లమెంటు చట్టం .
జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (nfsa 2013) భారత ప్రభుత్వం యొక్క ప్రస్తుత ఆహార భద్రతా కార్యక్రమాలకు చట్టపరమైన రూపం. ఇందులో మధ్యాహ్న భోజన పథకం , సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నాయి . ఇంకా, nfsa 2013 ప్రసూతి అర్హతలను గుర్తిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ స్కీమ్ ప్రకృతిలో సార్వత్రికమైనవి అయితే pds జనాభాలో మూడింట రెండు వంతుల (గ్రామీణ ప్రాంతాల్లో 75% మరియు పట్టణ ప్రాంతాల్లో 50%) చేరుతుంది.బిల్లులోని నిబంధనల ప్రకారం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (లేదా, pds) లబ్ధిదారులు క్రింది ధరలకు ప్రతి వ్యక్తికి 5 కిలోగ్రాముల తృణధాన్యాలు నెలకు : కిలోకి ₹ 3 చప్పున బియ్యం, గోధుమలు కిలోకు ₹ 2 , ముతక ధాన్యాలు ( మిల్లెట్ ) కిలోకు ₹ 1 చొప్పున కేంద్రం సరఫరా చేస్తుంది.
ఇప్పుడు free ration ద్వారా ఏమి పంపిణి చేస్తారు?
ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి లేదా అంత్యోదయ కార్డులు కలిగిన వారికి రూపాయికి బియ్యం సరఫరా చేస్తుండగా, ఇకపై ఈ భారాన్ని కేంద్రం భరించనుంది తద్వారా లబ్ధిదారులకు ఉచితంగా ప్రతి సభ్యునికి 5 కిలోల చొప్పున బియ్యం ఏడాది పాటు లభించనుంది. రాష్ట్రాలను బట్టి ప్రస్తుతం చెల్లించే సబ్సిడీ అమౌంట్ ఇకపై లబ్ధిదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనినీ నేరుగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది
ఎప్పటివరకు పంపిణి చేస్తారు?
కోవిడ్ సమయంలో 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించగా డిసెంబర్ 2022 తో ఈ పథకం ముగిస్తున్న నేపథ్యంలో నేరుగా ఆహార భద్రత చట్టం పరిధిలో ఇకపై ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముగించింది.
ఎంతమందికి ఇది వర్తిస్తుంది ?
ప్రస్తుతం ఆహార భద్రత చట్టం కింద దేశవ్యాప్తంగా రేషన్ పొందుతున్న 81.35 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుంది.