➤ మిషన్ వాత్సల్య పథకంలో నెలకు రూ.4వేలు ఆర్థిక సాయం
➤ దరఖాస్తుకు చివరి గడువు ఏప్రిల్ 26వ తేదీ.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం కింద ప్రభుత్వం అనాథ బాలలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది ఈ పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
మిషన్ వాత్సల్య పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు వారు అర్హులు
➤ అనాథలు, అభాగ్యులు
➤ తల్లిదండ్రులు కోల్పోయిన వారు
➤ తల్లిదండ్రులు దూరమైన వారు
➤ పాక్షిక అనాథలు (తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారు) విడాకులు పొందిన తల్లిదండ్రులు ఉన్నవారు కుటుంబం వదిలివేసిన, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన వారు
➤ పేదరికంతో ఇంటి పెద్దను కోల్పోయిన బాలల న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం- 2015 ప్రకారం ఇల్లు లేని పిల్లలకు
➤ ప్రకృతి వైపరీత్యానికి గురయిన బాలలుబాల కార్మికులు, అక్రమ రవాణాకు, దాడులకు గురైన బాలలు
➤ బాల్య వివాహ బాధితులు, హెచ్ఐవీ బాధిత/పీడిత బాలలు, వికలాంగులు
➤ బాలుడు/బాలిక జనన ధ్రువీకరణ పత్రం
➤ దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, తల్లి, తండ్రి ఆధార్ కార్డులు
➤ తల్లి/తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, మరణానికి కారణం
➤ గార్డియన్ ఆధార్, రేషన్ కార్డు
➤ కుల ధ్రువీకరణ పత్రం
➤ బాలుడు/ బాలిక పాస్ పోర్టు సైజు ఫొటోలు
➤ స్టడీ సర్టిఫికెట్ (స్కూలులో ప్రస్తుతం చదువుతున్నది)
➤ ఆదాయ ధ్రువీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతాలు నివసించే కుటుంబాలు వారి ఆదాయం రూ.72 వేలకు, ఇతర ప్రాంతాలలో రూ.96 వేలకు మించకూడదు.) -బ్యాంకు
అకౌంటు వివరములు (బాలుడు/ బాలిక వ్యక్తి గత అకౌంట్ లేక తల్లి/తండ్రి/సంరక్షకులతో కలిపి జాయింట్ అకౌంట్) జత చేయాలి.
ఆరోగ్య స్థితిగతులు, విద్య కొనసాగించే విధానం తెలియజేస్తూ దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు జత చేసి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లోనూ దరఖాస్తులు స్వీకరిన్నారు. మండల స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేస్తారు.