జగనన్న విద్యా కానుక పథకం 2023-Vidya Kanuka Scheme 2023

#

జగనన్న విద్యా కానుక పథకం 2023-YSR Vidya Kanuka Scheme 2023







 

జగనన్న విద్యా కానుక పథకం అంటే ఏమిటి?
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వం ఆరు రకాల వస్తువులను అందిస్తుంది.
1. మూడు జతల యూనిఫాం
2. నోట్ బుక్స్ మరియు పుస్తకాలు
3. బూట్లు లేదా షూస్
4. రెండు జతల సాక్సులు
5. బెల్ట్
6. స్కూల్ బ్యాగ్
7. అదనంగా ఒకటి మరియు ఆరవ తరగతి వారికి డిక్షనరీ

విద్యా కానుక పథకం ముఖ్యమైన లక్ష్యాలు :

i. అక్షరాస్యత పెంచడం
ii. విద్యాలయాల్లో పిల్లల ఎన్రోల్మెంట్ పెంచడం
iii. విద్యాలయాల్లో పిల్లల డ్రాపౌట్ రేటు ను తగ్గించడం
iv. పిల్లలకు చదువుకు కావలసిన అన్ని వస్తువులు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించడం
v. తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గించడం
vi. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచి మంచి విద్యను అందించడం


ఇతర విశేషాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా కనుక పథకం కింద విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులు మరియు పాఠ్య పుస్తకాలతో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధించాలని నిర్ణయించింది. మరోవైపు తెలుగు ను కూడా కొనసాగిస్తూ మరింత పోటీతత్వం తో కూడిన విద్యను పేద విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇతర పథకాలు అయినటువంటి మనబడి నాడు నేడు మరియు మధ్యాహ్న భోజన పథకం అయినటువంటి జగనన్న గోరుముద్ద తోటి మరింత పటిష్టంగా అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటితోపాటు పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి అమ్మఒడి ఇలాంటి పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది.
ఫలితంగా మెరుగైన మౌలిక సదుపాయాలు తో విద్యా విధానాన్ని మెరుగుపరిచి అధిక నిలుపుదల మరియు పూర్తి అక్షరాస్యత సాధించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.


రాష్ట్రంలో పాఠశాలల వివరాలు
TOTAL NUMBER OF SCHOOLS: 44512

ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలు వర్తిస్తుంది. ఇది రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో పాఠశాల విద్య విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వారిచే అమలు చేస్తున్న పథకం.


Share:
#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #