Jagananna Smart Town Scheme - జగనన్న స్మార్ట్ టౌన్ పథకం






జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ఏమిటి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి సొంత ఇంటి కల సాకారం చేసే దిశగా జగనన్న స్మార్ట్ టౌన్ పేరుతో ఇంటి స్థలాలను పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు.
3 లక్షల నుంచి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు..ప్రభుత్వ ఉద్యోగులు కూడా పథకానికి అర్హులు. ఆసక్తి కలవారు మీ సచివాలయంలో సంప్రదించండి.

స్థలం వివరాలు అర్హత

స్థల వివరములు వార్షిక ఆదాయం
MIG 1 150 చదరపు గజాలు (3 సెంట్లు) 3 లక్షల నుంచి 6 లక్షల వరకు..
MIG 2 200 చదరపు గజాలు (4 సెంట్లు) 6 లక్షల నుంచి 12 లక్షల వరకు..
MIG 3 250 చదరపు గజాలు (5 సెంట్లు) 12 లక్షల నుంచి 18 లక్షల వరకు..


పథకం ప్రత్యేకతలు


⦿ తక్కువ ధరలకే ఇంటి స్థలాలు..
⦿ పార్కులు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేక స్థలం..
⦿ విశాలమైన రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు..
⦿ లీగల్ సమస్యలు ఉండవు..
⦿ కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం..
⦿ ఆరోగ్య కేంద్రం..
⦿ షాపింగ్ సెంటర్ ఏర్పాటు..
⦿ బ్యాంకు సదుపాయం ఉంటుంది..
⦿ వార్డు సచివాలయం ఏర్పాటు..
⦿ అంగన్వాడీ కేంద్రం మరియు మార్కెట్ సౌకర్యం..
⦿ ప్రత్యేక వాకింగ్ ట్రాక్..
⦿ నీటి సరఫరా , ఓవరెడ్ ట్యాంక్, సోలార్ ప్యానెల్..
⦿ విద్యుత్ సబ్ స్టేషన్, ప్లంటేషన్ సౌకర్యం..
⦿ పిల్లలకు ఆట స్థలం .. మొదలైన వాటికి స్థలం కేటాయింపు..

అర్హతలు


⦿ వార్షిక ఆదాయం 3 నుంచి 18 లక్షలు ఉండవలయును..
⦿ ఒక కుటుంబానికి ఒక ప్లాట్ మాత్రమే ఇవ్వబడును..
⦿ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులు (ఫామ్ 16 సబ్మిట్ చేయాలి)


ఎవరిని సంప్రదించాలి


⦿ మీ సమీప సచివాలయం లేదా
⦿ పట్టణ ప్రణాళిక సంఘం లేదా
⦿ పురపాలక సంఘం

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #