► నవంబర్ 15న అసైన్డ్ భూ హక్కు, భూ పంపిణీ కార్యక్రమం
► ఇప్పటివరకు 2000 గ్రామాలలో రీసర్వే పూర్తి అయిన 7,92,238 భూ యజమానులకు భూ హక్కు పత్రాలను అందిస్తున్న ప్రభుత్వం.
పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మరియు గ్రామ కంఠాల సర్వ్.
డూప్లికేట్ రికార్డులు , భూ వివాదాల పరిష్కారమే లక్ష్యం.
గ్రామ మరియు పట్టణ ప్రాంతాలలో సమగ్ర సర్వ్.
‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష’ 2023 నాటికి భూముల రీసర్వే పూర్తికానుంది. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలు పని చేస్తున్నాయి. 70 కార్డ్స్ బేస్ స్టేషన్లు, 1500 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతిక సర్వే జరుగుతోంది. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీ ఆధునిక సమగ్ర భూ రీసర్వేను చేపట్టింది. సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత హక్కు పత్రం జారీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.