Jagananna Thodu Scheme - జగనన్న తోడు

జగనన్న తోడు Latest videoVideos

Jagananna తోడు పథకం పూర్తి వివరాలు అప్లికేషన్ విధానం వీడియో. Thank you visit our youtube channel....

#

జగనన్న తోడు - Jagananna Thodu Scheme






జగనన్న తోడు లబ్ధిదారులకు ముఖ్య సమాచారం చిరువ్యాపారులను, సాంప్రదాయ వృత్తిదారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు నవంబర్ 25, 2020 న "జగనన్న తోడు" పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో చిరువ్యాపారులను, ఫుట్ పాళ్ల మీద, తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, గంపలు, బుట్టలు పెట్టుకుని వస్తువులను అమ్మేవారు...తమ రోజువారీ పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడి, అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇబ్బందుల పాలవుతున్నారు.....అంతేకాక, సాంప్రదాయ వృత్తులైనటువంటి ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేస్ వర్క్, కళంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి మొదలైన వారు కూడా విపరీతంగా వడ్డీ చెల్లించి ఆర్థికంగా చితికిపోతున్నారు..... వీరందరినీ ఆదుకోవడానికి, ప్రభుత్వం ఒక్కొక్కరికీ బ్యాంకుల ద్వారా రూ. 10 వేల వరకు వడ్డీ లేని ఋణాన్ని అందించి, దీనిపై వచ్చే వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటిదాకా, ప్రభుత్వం తొలి, మలి విడతల్లో 9.05 లక్షల మంది చిరువ్యాపారులకు, సాంప్రదాయ వృత్తిదారులకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా మొత్తం 905 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైనది. అయితే బ్యాంకు ద్వారా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందిన చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు ఈ సూచనలను తప్పక పాటించాలి...

సూచనలు :

* బ్యాంకులు 10 వేల రూపాయల ఋణాన్ని అందిస్తాయి. ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అయితే బ్యాంకులు ఇచ్చిన వడ్డీలేని ఋణాన్ని సకాలంలో చెల్లించడం మన విధి.
* ఏటా అసలు సొమ్ము 10 వేల రూపాయలను సకాలంలో బ్యాంకులకు చెల్లించిన వారు, మళ్ళీ వడ్డీ లేని ఋణాన్ని తీసుకోవడానికి అర్హులవుతారు.
+ నెల నెలా వాయిదాలు / కంతులు (EMI) సక్రమంగా చెల్లించిన వారి ఖాతాలలో వడ్డీ మాఫీ డబ్బులు 6 నెలలకొకసారి అనగా జూన్, డిసెంబర్ మాసాలలో జమ అవుతాయి. వాయిదాలు | కంతులు నిర్ణీత తేదీన చెల్లించాలి. చెల్లించకపోతే, 90 రోజుల వరకు ఓవర్ డ్యూ గా పరిగణిస్తారు... ఆ తర్వాత వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటిస్తారు.
+ NPA గా ప్రకటింపబడినట్లైతే, మున్ముందు ఎటువంటి ఋణాలు పొందలేరు.. మరియు సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి, జగనన్న తోడు వాయిదాలను సకాలంలో చెల్లించవలెను.
* బ్యాంకులకు ఋణ చెల్లింపులు సక్రమంగా చేసిన లబ్ధిదారులకు ఇతరత్రా బ్యాంకు ఋణాలు పొందడం సులభమవుతుంది.
+ సకాలంలో డబ్బులు చెల్లించడం ద్వారా భవిష్యత్తులో మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా సులభంగా బ్యాంకు ఋణం లభిస్తుంది.
+ చిరు వ్యాపారులు. సాంప్రదాయ వృత్తిదారులు - జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన 10 వేల రూపాయల వడ్డీలేని ఋణ అవకాశాన్ని వ్యాపారాభివృద్ధికి సద్వినియోగం చేసుకోండి,
+ ఇప్పటివరకు వాయిదాను చెల్లించకుండా వుంటే, నవంబర్ 15 లోపు చెల్లించండి. వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి పొందండి. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదనేదే ప్రభుత్వ దృఢ సంకల్పం.
* మీరు బ్యాంకుకు చెల్లించిన వడ్డీ, ప్రభుత్వం మళ్ళీ మీకు తిరిగి చెల్లిస్తుంది. వ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయం, వారి మేలు కోరే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #