✤ గడప గడప కార్యక్రమం పై సీఎం సమీక్ష
✓ఒక్కో సచివాలయానికి ప్రాధాన్యత పనుల కోసం 20 లక్షల కేటాయింపు.. గడపగడపకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చే వినుతులను తీసుకొని ప్రాధాన్యత పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
✓రానున్న నెల రోజుల్లో ఎమ్మెల్యేలు 7 సచివాలయాలను సందర్శించాలని వచ్చే నెల రోజుల్లో కనీసం 16 రోజులు గరిష్టంగా 21 రోజులు గడపగడప కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు
✤ రాష్ట్ర వ్యాప్తంగా గడప గడప కు మన ప్రభుత్వం లో భాగంగా పర్యటిస్తున్న MLA లు
✤ గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ నియోజకవర్గాలలోని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రజల ఇళ్లను సందరిస్తున్న ఎమ్మెల్యేలు.
✤ కార్యక్రమంలో అధికారులు , సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు
✤ సమస్యలను అదే రోజు నమోదు . సంక్షేమ పథకాలకు సంబందించిన సమస్యలు GSWS పోర్టల్ లేదా స్పందన లో నమోదు
ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధికి సంబంధించి గౌ౹౹ MLA లు మే 11 నుండి తమ అధికార పరిధిలోని గృహాలను సందర్శించే "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబందించిన మార్గదర్శకాలు , జీ.ఓ నెంబర్ 68, ది.10.05.22 విడుదల, పూర్తిసమాచారం పైన ఇవ్వడం జరిగింది..