1. విష్ణుకుండినులు ఏర్పాటు చేసిన ‘ఘటికలు’ అంటే ఏమిటి?
1) వర్తక కేంద్రాలు:
2) ఓడరేవు కేంద్రాలు
3) విద్యా కేంద్రాలు
4) పన్నులు
3) విద్యా కేంద్రాలు
2. 'త్రివర నగర భవనగత సుందరీ హృదయ నందన' అనే బిరుదు ఉన్న విష్ణుకుండిన రాజు?
1) రెండో మాధవ వర్మ
2) మొదటి గోవింద వర్మ.
3) రెండో విక్రమేంద్ర వర్మ
4) రెండో ఇంద్రవర్మ
1) రెండో మాధవ వర్మ
3. 'ఉత్పత్తి పిడుగు' అనే లేఖనం ఎక్కడ లిఖించారు?
1) మొగల్రాజపురం
2) భైరవకోన
3) ఉండవల్లి
4) గుమ్మడిదుర్రు
3) ఉండవల్లి
4. భైరవకోనలోని ఎనిమిది గుహలు ఏ దేవునికి అంకితం చేశారు?
1) విష్ణువు
2) ఇంద్రుడు
3) బ్రహ్మ
4) శివుడు
4) శివుడు
5. భూతగ్రహస్వామి అని ఏ దేవునిని అంటారు?
1) వినాయకుడు
2) యమధర్మరాజు
3) బ్రహ్మదేవుడు
4) పరమేశ్వరుడు
2) యమధర్మరాజు
6. జతపరచండి.
జాబితా-1
1. అర్ధనారీశ్వర గుహాలయం
2. త్రిముఖ దుర్గ శిల్పం
3. పూర్ణకుంభం
4. బౌద్ధక్షేత్రం
జాబితా-2
ఎ. బొజ్జన్నకొండ
బి. ఉండవల్లి
సి. భైరవకోన
డి. మొగల్రాజపురం
1) 1-డి , 2- బి, 3- ఎ, 4- సి
2) 1- బి, 2- డి, 3- సి, 4- ఎ
3) 1- డి, 2- సి, 3- బి, 4- ఎ
4) 1- సి, 2- ఎ, 3- డి, 4- బి
3) 1- డి, 2- సి, 3- బి, 4- ఎ
7. విష్ణుకుండినులు తమ రాజ్యంను దేనితో పోల్చుకున్నారు?
1) పాంచజన్యం
2) ఖట్వాంగం
3) కౌస్తుభం
4) స్వస్థిక్
3) కౌస్తుభం
8. విష్ణుకుండినుల రాజ్యాన్ని అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు?
1) మొదటి పులకేశి
2) మంగళేసు
3) రెండో పులకేశి
4) రవికీర్తి
3) రెండో పులకేశి
9. గజదళాధిపతిని ఏమని పిలుస్తారు?
1) హస్తికోశ
2) వీరకోశ
3) స్కంధావారం
4) గుల్మీక
1) హస్తికోశ
10. శాలంకాయన రాజు హస్తివర్మ కాలంలో వేంగిపై దండెత్తిన గుప్తరాజు ఎవరు?
1) శ్రీగుప్తుడు
2) మొదటి చంద్రగుప్తుడు
3) సముద్రగుప్తుడు
4) భానుగుప్తుడు.
3) సముద్రగుప్తుడు
11. చిత్రరథస్వామి పాదభక్తులము అని చెప్పు కున్న రాజులు?
1) విష్ణుకుండినులు
2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు
4) శాలంకాయనులు
4) శాలంకాయనులు
12. సప్త మాతృక విగ్రహాలు ఉన్న ప్రాంతం ఏది?
1) నారాయణ వనం
2) నందిగామ
3) సోమశిల
4) దేజెర్ల
4) దేజెర్ల
13. త్రిమూర్తి ఆరాధనకు ప్రాచీన ఆంధ్ర దేశంలో లభించిన ఆధారం ఏ ప్రాంతంలో ఉంది?
1) భైరవకోన
2) సంగమయ్య గుహ
3) బెలుంగుహలు
4) ఏనుగు మల్లమ్మ కొండలు
1) భైరవకోన
14. జతపరచండి.
రాజవంశం:
1. వేంగి చాళుక్యులు
2. ఆనంద గోత్రజులు
3. విష్ణుకుండినులు
4. రాష్ట్రకూటులు
చిహ్నం:
ఎ. వృషభం
బి. వరాహం
సి. పంజా విసిరిన సింహం
డి. గరుడ
1) 1- ఎ, 2- సి, 3- డి, 4-బి
2) 1- బి, 2- ఎ, 3- సి, 4- డి
3) 1- సి, 2- డి, 3- బి, 4- ఎ
4) 1- డి, 2- బి, 3- సి, 4- ఎ
2) 1- బి, 2- ఎ, 3- సి, 4- డి
15. బృహత్పలాయనుల రాజధాని ఏది?.
1) వేంగి
2) కోడూరు
3) తుమ్మలగూడెం
4) హన్మకొండ
2) కోడూరు
16. గోలాంగులము అంటే?
1) గరుడు
2) కోతి
3) పంజా విసిరే సింహం
4) సింహం
2) కోతి
17. తాడికొండలో శాక్యభిక్లు విహారం నిర్మించింది. ఎవరు?
1) పృథ్వీమూలుడు
2) హరివర్మ
3) రెండో విక్రమేంద్ర వర్మ
4) అనంతవర్మ
2) హరివర్మ
18. శాలంకాయన అంటే అర్థం ఏమిటి?..
1) చిలుక
3) నెమలి.
2) సింహం.
4) నంది.
4) నంది.
19. హిరణ్య గర్భయాగం అంటే ఏమిటి?
1) పుట్టుకతో బ్రాహ్మణుడు కాకున్నా యాగం తో కావడం
2) పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా యాగం తో కావడం
3) పుట్టుకతో వైశ్యుడు కాకున్నా యాగంతో కావడం
4) పుట్టుకతో శూద్రుడు కాకున్నా యాగంతో కావడం
2) పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా యాగం తో కావడం
20. భారవేలుడు జారీ చేసిన హాతిగుంఫా శాసనం ఏ భాషలో ఉంది?
1) ప్రాకృతం
2) సంస్కృతం
3) తెలుగు
4) ఒరియా
1) ప్రాకృతం
Leave a Reply