1. సూర్యుడి ఉపరితలంలో ఆరువేల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉండగా, సూర్యుడి కరోనాలో 10 లక్షల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటి విషయాలపై అధ్యయనం చేయడానికి– ఇస్రో ‘ఆదిత్య-ఎల్ 1’ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించనున్నది?
1) 2020
2) 2021
3) 2022
4)2023
1) 2020
2. ఫేస్బుక్ కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ 100 దేశాలతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నెట్ సూచీలో స్వీడన్, సింగపూర్, అమెరికా దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ స్థానం ఎంత??
1) 74
2) 47
3) 67
4) 76
2) 47
3. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన తొలి కార్యాలయాన్ని ఆఫ్రికా ఖండంలోని ఏ దేశంలో ప్రారంభించింది?
1) దక్షిణాఫ్రికా
2) కెన్యా
3) ఘనా
4) నైజీరియా
3) ఘనా
4. హెచ్ టీటీపీ ద్వారా 'వరల్డ్ వైడ్ వెబ్' ఇంటర్నెట్ సేవలు ప్రారంభించి 2019, మార్చి 12 నాటికి 30 ఏండ్లు పూర్తయింది. అయితే 1989, మార్చి 12న వరల్డ్ వైడ్ వెబ్ ను ఆవిష్కరించినది. ఎవరు?
1) రెటా మిస్సన్
2) టిమ్ బెర్నర్స్ లీ
3) జాన్లో గ్ బియార్డ్
4) జానమ్యాక్ కార్టీ
2) టిమ్ బెర్నర్స్ లీ
5. '5జీ టెక్నాలజీ నెట్ వర్క్, గిగాబైట్ సామర్థ్యంతో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కలిగిన తొలి నగరంగా చైనాలోని ఏనగరం గుర్తింపు పొందింది?
1) హువాన్
2) జియక్వాన్
3) హాంకాంగ్
4) షాంఘై
4) షాంఘై
6. మాదక ద్రవ్యం 'మారిజువానా'ను వాణిజ్యపర ఎగుమతులకు అనుమతించడంతోపాటు, కొన్ని వైద్యపరమైన అవసరాలకు వినియోగించుకోవడానికి పలు దేశాలు చట్టం చేశాయి. కింది వాటిలో ఇలా చట్టం చేసిన దేశాలతో సంబంధం లేనిది ఏది?
1) అమెరికా
2) కెనడా
3) ఇజ్రాయెల్
4) నెదర్లాండ్
1) అమెరికా
7. కిందివాటిలో సరికానిది ఏది?
1) ప్రపంచలోనే తొలిసారిగా మలేరియా వ్యాక్సిస్ వాడకాన్ని అమల్లోకి తెచ్చిన దేశం - మలావి
2) ఆ వ్యాక్సిన్ పేరు ఆర్ఎస్ఎస్
3) ఆ వ్యాక్సిన్ను రెండేండ్లలోపు పిల్లలకు ఇస్తారు.
4) ఆ వ్యాక్సిన్ను సిప్లా సంస్థ రూపొందించింది.
4) ఆ వ్యాక్సిన్ను సిప్లా సంస్థ రూపొందించింది.
8. కిందివాటిలో సరైనది ఏది?
1) 63 దేశాల్లో సాంకేతిక మార్పుల ఆధారంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్మెంట్ ప్రపంచ డిజిటల్ పోటీతత్వ నివేదికలను విడుదల చేసింది.
2) అమెరికా, సింగపూర్, స్వీడన్ దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
3) భారత్ 44వ స్థానంలో నిలిచింది.
4) పైవన్నీ
4) పైవన్నీ
9. "రిపోర్టర్స్ వితౌట్ బోర్టర్స్' అనే సంస్థ రూపొందించిన ప్రపంచ పత్రికాసూచీ 2019లో నార్వే, ఫిన్లాండ్, స్వీడనీలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా, భారత్ 140వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో చివరి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి?
1) తుర్కెమెనిస్థాన్, ఉత్తరకొరియా, ఎరిత్రియా
2) ఉత్తరకొరియా, సోమాలియా, చైనా
3) చైనా, ఉత్తరకొరియా, జింబాబ్వే
4) హాంకాంగ్, చైనా, ఉత్తరకొరియా
1) తుర్కెమెనిస్థాన్, ఉత్తరకొరియా, ఎరిత్రియా
10. అణ్వస్త్రాల తర్వాత అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిగ ణించబడుతున్న 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB)'ను చైనా రూపొందించింది. అమెరికా తర్వాత ఇలాంటి ఆయుధాన్ని తయారు చేసిన దేశంగా చైనా గుర్తింపు పొందింది. అయితే MOAB అసలు పేరు ఏమిటి?
1) మదర్ ఆఫ్ ఎనీ బాంబ్
2) మ్యాసిప్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్
3) మ్యాసివ్ ఆఫ్ ఆల్ బాంబ్
4) మదర్ ఆఫ్ ఎయిర్ బ్లాస్ట్
2) మ్యాసిప్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్
11. కింది వాటిలో సరైనది ఏది?
1) అంతర్జాతీయంగా మనీలాండరింగ్ విషయాలను పర్ శీలించడానికి 1989లో ఏర్పడిన సంస్థ ఎఫ్ఎఏటీఎఫ్
2) ఎఫ్ఎఏటీఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టెర్రరిస్ట్ ఫోర్స్
3) ఈ సంస్థలో సౌదీ అరేబియా 40వ దేశంగా పేరు గాంచింది.
4) ఈ కూటమిలో సభ్యత్వం పొందిన తొలి గల్ఫ్ దేశం. ఖతార్
1) అంతర్జాతీయంగా మనీలాండరింగ్ విషయాలను పర్ శీలించడానికి 1989లో ఏర్పడిన సంస్థ ఎఫ్ఎఏటీఎఫ్
12. 'మేరీ మేకర్' అనే సంస్థని వేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక - ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశంగా చైనా నిలిచింది.. భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 4వ
2) 3వ
3) 2వ
4) 5వ
3) 2వ
13. ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పుల సదస్సు - 2019 క్రాప్- 25 స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో లో జరిగింది. ఈ సదస్సులో భారత్ కు చెందిన ఎనిమిదేండ్ల బాలిక లిసి ప్రియా కంగుజమ్ పాల్గొన్నది. ఆమె ఏరాష్ట్రానికి చెందిన బాలిక?
1) మేఘాలయా
2) మణిపూర్
3) నాగాలాండ్
4) త్రిపుర
2) మణిపూర్
14. కింది వాటిలో సరైనది ఏది?
1) ప్రపంచంలో తొలి కృత్రిమ మేధస్సు యూనివర్సిటీని యూఏఈ ఏర్పాటు చేసింది.
2) ఈ యూనివర్సిటీ అబుదాబి కేంద్రంగా పనిచేస్తుంది
3) ఈ యూనివర్సిటీ పేరును మహమ్మద్ బిన్ జాయిద్ యూనివర్సిటీగా నిర్ణయించారు.
4) పైవన్నీ
4) పైవన్నీ
15. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 మే నెలలో రెండు దేశాలను పోలియో రహిత దేశాలుగా ప్రకటించింది. దీంతో పోలియో రహిత దేశాల సంఖ్య 38కి చేరింది. ఆ రెండు దేశాలు ఏవి?
1) భారత్, చైనా
2) భారత్, శ్రీలంక
3) అల్జీరియా, అర్జెంటీనా
4) తైమూర్, అల్సాల్వెడార్
3) అల్జీరియా, అర్జెంటీనా
16. ప్రపంచంలోనే ఎత్తయిన సరస్సుగా కజిన్ సారా (5002 మీ.) గుర్తింపు పొందింది. అది ఏ దేశంలో ఉన్నది?
1) నేపాల్
2) చైనా
3) దక్షిణకొరియా
4) ఫిన్లాండ్
1) నేపాల్
17. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఎవరు నియమితులయ్యారు?
1) ఇంద్రానూయి
2) సత్య నాదెళ్ల
3) సుందర్ పిచాయ్
4) ల్యారీపేజ్
3) సుందర్ పిచాయ్
18. హైదరాబాద్ లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి నూతన డైరెక్టర్గా బిహార్ కేడర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నియమితులయ్యారు. ఆయన పేరు?
1) AS Rajan
3) అరుణ బహుగుణ
2) గీతాజోహ్రీ
4) అతులాకార్వల్
1) AS Rajan
19. 2019కి గాను లండన్ కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ను డా. గుండ్రా సతీష్రెడ్డికి ప్రకటించారు. ఆయన ఏ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు?
1) డీఆర్డీఓ
2) ఎస్ఆర్ఎస్సీ
3) ఐఎస్ఆర్ఆ
4) ఎన్ఎస్ఏ
1) డీఆర్డీఓ
20. టైమ్ మ్యాగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా పర్యావరణ. ఉద్యమకారిణి గ్రేటా థన్ బర్గ్ పేరును 2019, డిసెంబర్ 11న ప్రకటించింది. ఆమె ఏ దేశానికి చెందిన వారు?
1) ఫిన్లాండ్
2) బ్రిటన్
3) స్వీడన్
4) నార్వే
3) స్వీడన్
Leave a Reply