e-Shram Full details - లేబర్ కార్డు (అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపు కార్డు ) పూర్తి సమాచారం
మోడీ సర్కార్ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త పోర్టల్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. మోదీ సర్కార్ ఇశ్రమ్ వెబ్‌సైట్ తీసుకువచ్చింది. అసంఘటిత కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు నమోదు చేసుకున్న వారికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
తాజాగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఫీజు
ఉచితం
అర్హులు
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కార్మికులు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, ఇళ్లలో దుకాణాలలో పనిచేయు కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి వర్తకులు, పాల వ్యాపారులు, చేతివృత్తుల వారు, వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధుల పనివారు : చిన్న పన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, వర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన మరియు దాని అనుబంధ రంగాలలో పనిచేసేవారు - తాపీ, తవ్వకం, రాళ్ళు కొట్టేపని, పెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, పానిటరీ, పేయింటర్, టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్చర్, బావులు తవ్వడం / పూడిక తదితరులు.
లాభాలు
1. సామాజిక భద్రతా చట్టము క్రింద సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతారు
2. వలస కార్మికుల కోసం పాలసీ & ప్రోగ్రామ్ లో డేటాబేస్ ప్రభుత్వానికి సహాయపడుతుంది
3. వృత్తి, నైపుణ్యాభివృద్ధి , మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుంది
4. సామాజిక భద్రత కొరకు ఆర్ధిక సహాయం (Direct Bank Transfer) ద్వారా కార్మికుల/నామినీల ఎకౌంటు నకు నేరుగా జమ చేయబడుతుంది. అసంఘటిత మరియు వలస కార్మికులూ నమోదు చేసుకోండి లబ్ది పొందండి.
వయసు
16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వారు అర్హులు..
కావలసిన డాక్యుమెంట్లు
1. ఆధార్ కార్డు
2. బ్యాంకు పాస్ బుక్
3. ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
4. అప్లికేషన్ ఫారం
ఎక్కడ అప్లై చెయ్యాలి
గ్రామ/వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.
CSC లాగిన్ ద్వారా అప్లికేషన్ చేయు విధానం
STEP 1 : మొదటగా మొదటగా
డిజిటల్ సేవ పోర్టల్ లేదా
e-Shram websiteలేదా
GSWS అధికారిక వెబ్ సైట్ఓపెన్ చేయాలి
STEP 2 : లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. లాగిన్ అయ్యాక సెర్చ్ బార్ లో eshram అని ఎంటర్ చెయ్యాలి. eShram-NDUW Registration అని చూపిస్తున్న దానిపై క్లిక్ చెయ్యాలి. (GSWS అధికారిక వెబ్ సైట్ నందు హోమ్ పేజీ లో CSC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి)
STEP 3 : Dash Board లో "NEW Registration"లేదా "UW REGISTER" పైన క్లిక్ చెయ్యాలి.
STEP 4 : ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి , CAPTCHA కోడ్ క్లిక్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. ఓటిపి ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేసిన తర్వాత ఆధార్ ఈ కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది . అక్కడ సిటిజన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫింగర్ప్రింట్ లేదా ఐరిష్ స్కానర్ లేదా OTP ద్వారా authentication చేయాలి.
STEP 5 : ఆధార్ ఈ కేవైసీ వివరాలు చూపిస్తాయి. అందులో బ్యాంకు వివరాలు, ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు మరియు బ్యాంకు ఆధార్ లింక్ స్టేటస్ చూపిస్తాయి. Agree ఆప్షన్ పై క్లిక్ చేసి Continue To Enter Other Details పై క్లిక్ చేయాలి.
STEP 6 : Personal Information లో భాగంగా మొబైల్ నెంబర్ , Alternative మొబైల్ నెంబర్ ( Optional),ఈమెయిల్ ( Optional ),వివాహం స్థితి,తండ్రి పేరు,రిజర్వేషన్, దివ్యంగ స్థితి నామినీ వివరాలు ఎంటర్ చెయ్యాలి.
STEP 7 : Residential Detail లో భాగం గా ఇంటి నెంబరు, లొకాలిటీ, రాష్ట్రము ,జిల్లా, మండలము, పిన్ కోడ్, ప్రస్తుత చిరునామాలో ఉన్నటువంటి సంవత్సరాలు , వలస కార్మికులు అవునా కాదా అనే డిటైల్స్ ఎంటర్ చెయ్యాలి.
STEP 8 : Educational Qualifications లో భాగం గా,విద్యాఅర్హత, నెలవారి జీతము స్లాబ్ ,నెలవారీ జీతంకు సంబంధించిన ప్రూఫ్ ఉన్నట్లయితే ప్రూఫ్ ని అప్లోడ్ చేయాలి.
STEP 9 : Occupation Details లో భాగం గా ప్రాథమిక వృత్తి, ప్రాథమిక వృత్తిలో సంవత్సరాల అనుభవం, ఇంకొక వృత్తి ఏదైనా చేసినట్లయితే దానిని తెలియ జేయాలి,వృత్తి ఆధారిత సర్టిఫికెట్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయాలి. స్కిల్స్ ఉన్నట్లయితే వాటిని మెన్షన్ చేయాలి,తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
STEP 10 : బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వాలి. ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఎకౌంటు active lo ఉన్నట్లయితే, అదే బ్యాంకు ను లింకు చేయాలనుకుంటే YES ఫై క్లిక్ చేసి SAVE & CONTINUE పై క్లిక్ చేయాలి. లేదా వేరొక బ్యాంకు ఎకౌంటు ఇవ్వాలి అనుకుంటే రిజిస్టర్ విత్ బ్యాంకు అకౌంట్ వద్ద నో ను సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి SAVE & CONTINUE పై క్లిక్ చేయాలి.
STEP 11 : ఫిల్ చేసిన వివరాలు చూపిస్తాయి సరిచూసుకొని అన్నీ కరెక్ట్ గా ఉంటె సెల్ఫ్ డిక్లరేషన్ వద్ద టిక్ ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి. ఒకవేళ వివరాలు తప్పుగా నమోదు అయినట్లయితే వెనుకకు వెళ్లి మళ్ళీ వివరాలు ఎంటర్ చెయ్యాలి .
STEP 12 : చివరగా మీ UAN కార్డు డౌన్లోడ్ చేసుకొని, కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకోవలెను.
సిటిజన్/Public లాగిన్ లో అప్లికేషన్ చేయు విధానం
e-shram website లింక్ పై క్లిక్ చెయ్యాలి. అందులో Self Registration వద్ద ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైక్ నెంబర్ ఎంటర్ చేసి , CAPTCHA కోడ్ టచ్ చేసి గెట్ వాటిపై క్లిక్ చేయాలి. ఓటిపి ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేసిన తర్వాత ఆధార్ ఈ కేవైసీ ఆప్షన్ చూపిస్తుంది. పైన చూపిన Step 5 నుంచి ఫాలో అవ్వాలి.