కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు - Covid exgratia amount process

#

Covid Ex gratia amount application process






భారత్ (India)లో కూడా దాదాపు 4.5 లక్షల మంది వైరస్ కు బలయ్యారు. కొవిడ్ కు బలైన కుటుంబాల్లో ధనికుల నుంచి పేదవాళ్ల వరకు అందరూ ఉన్నారు. ఈ మహమ్మారి కారణంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సిఫార్లు చేసినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ పరిహారాన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ నుంచి చెల్లించాలని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందనుంది.

సర్టిఫికెట్ తప్పనిసరి..

(1) చనిపోయిన వ్యక్తి Aadhar కార్డు xerox
(2)Phone నెంబర్
(3) కోవిడ్ పాజిటివ్ certificate
(4) Death Certificate
(5) Family Member Certificate
(6) Applicant Aadhar xerox / Phone నెంబర్
(7) Rice కార్డు xerox.. or కుటుంబ ధ్రువీకరణ పత్రం
(8) తెల్లకాగితముపై అర్జీ..
(9) బ్యాంక్ బుక్ జిరాక్స్
(10) CDAC నెంబర్ (డాక్యుమెంట్)

ఎక్కడ అప్లై చేసుకోవాలి

కొవిడ్ మృతుల కుటుంబాలు పరిహారానికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించిన తర్వాత 30 రోజుల లోపు వారికి సొమ్ము అందాల్సి ఉంటుంది. బాధిత కుటుంబాలు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన దరఖాస్తు నింపి.. దానికి కొవిడ్ తో మరణించినట్లు ధృవీకరణ పత్రం, ఆధార్, నామినీతో పాటు ఇతర వివారలను జతపరిచి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి అధికారులు వాటిని తనిఖీ చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీకి పంపుతారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, వైద్యఆరోగ్య శాక అధికారి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు చేసుకున్న కుటుంబానికి పరిహారం చెల్లించాలా..? వద్దా..? అనేది సిఫార్సు చేస్తుంది. అలాగే దరఖాస్తును తిరస్కరిస్తే గనుక ఎందుకు తిరస్కరించాల్సి వస్తుందో కారణం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

#

JOIN Our Govt Schemes Telegram Group

#

JOIN Our STUDYBIZZ Telegram Group

  • #
  • #
  • #
  • #