Ayushman Bharat Yojana Scheme Eligibility, Benefits, All Details

#

Ayushman Bharat Yojana Scheme Eligibility, Benefits, All Details





కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఒకటుంది. ఈ పథకం కింద అర్హులైన వారికి ఉచితంగానే రూ.5 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. ఆయుష్మాన్ భారత్ అనేది హెల్త్ స్కీమ్. 2018 ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2018 బడ్జెట్‌లోనే ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.
ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బలహీన వర్గాలకు అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంచడం. అయితే ఇక్కడ పథకం అమలులోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కూడా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. 53 కోట్ల మందికి ఈ స్కీమ్ కింద ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ స్కీమ్ లక్ష్యంలో ఇంకా సగం కూడా చేరుకోలేదని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీలో ఈ స్కీమ్ అమలులో లేదు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో ఒక్కొక్కరికి కాకుండా ఒక్కో కుటుంబానికి ఒక కార్డును అందిస్తున్నారు. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ కార్డులు జారీ అయ్యాయి. ఇలా ఆయుష్మాన్ స్కీమ్ లక్ష్యంలో సగం మందికి కూడా చేరువ కాలేదని చెప్పుకోవచ్చు.
ఇకపోతే ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవచ్చు. కరోనా సమయంలో చాలా మంది ఆయుష్మాన్ కార్డుల ద్వారా వైద్యం చేయించుకున్నారు. మీరు కూడా ఈ కార్డు పొందాలని భావిస్తే.. దగ్గరిలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి సంప్రదించండి. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా మీరు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ స్కీమ్ ద్వారా కొన్ని హాస్పిటల్స్‌లో ఫేక్ బిల్లులు కూడా పెడుతున్నట్లు తెలిసింది. ఆపరేషన్ చేయకపోయినా చేసినట్లు, అలాగే హాస్పిటల్ నుంచి డిస్‌చార్జ్ అయిపోయిన వారి పేరుపై మళ్లీ బిల్లులు, డయాలసిస్ చేయకపోయినా చేసినట్లు ఇలా పలు రకాల మోసాలు జరిగాయి. ఉత్తరఖండ్‌లో ఇలాంటివి ఎక్కువగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి హాస్పిటల్స్‌పై రూ.కోటి వరకు జరిమానా విధించింది. అందువల్ల ఈ కార్డు కలిగిన వారు ఇలాంటి మోసాలకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

అర్హులు ఎవరు?

⦿ 10 కోట్ల కుటుంబాలకు పీఎంజేఏవై వర్తిస్తుంది. వీరిలో ఎనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాలు, 2.33 కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఉన్నాయి.
⦿ గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనివారు, కేవల వేతనం మాత్రమే తీసుకునేవారు, ఇతరత్రా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు దీనికి అర్హులు.
⦿ పట్టణ ప్రాంతాల్లో చేసే వృత్తుల ఆధారంగా లబ్దిదారులను నిర్ణయిస్తారు. ఈ పథకం కింద కేంద్రం ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షలు అందజేస్తుంది.
⦿ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) కింద నమోదు చేయించుకున్న వాళ్లు పీఎం జన్ ఆరోగ్య యోజన పరిధి కిందకు వస్తారు.

ఈ పథకం కింద అందించే ఖర్చులు

⦿ ఆసుపత్రిలో చేర్చినపుడు అయిన ఖర్చుతోపాటు వైద్యపరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ-హాస్పిటలైజేషన్, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు అందిస్తారు.
⦿ డయాగ్నస్టిక్స్, లేబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత 15 రోజుల పాటు వైద్య పరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు.
⦿ కోవిడ్-19 చికిత్సను కూడా ఈ పథకం కింద అందిస్తారు.

కావలసిన ధృవపత్రాలు:

⦿ గుర్తింపుకార్డు
⦿ వయసు ధృవపత్రం (ఆధార్ కార్డు/పాన్ కార్డు)
⦿ మొబైల్ నంబర్
⦿ ఈ-మెయిల్ అడ్రస్
⦿ ఇంటి అడ్రస్
⦿ కుల ధృవపత్రం
⦿ ఆదాయ ధృవపత్రం
⦿ కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం.

పీఎంజేఏవై ఆసుపత్రుల జాబితా తెలుసుకోవాలంటే

పీఎంజేఏవై ఆసుపత్రుల జాబితా తెలుసుకోవాలంటే పీఎంజేఏవై అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో హాస్పిటల్ సెక్షన్లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేయాలి. ఏ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నారో (ప్రభుత్వ, ప్రైవేట్-ఫర్-ప్రాఫిట్/ప్రైవేట్-అండ్ నాన్‌ ప్రాఫిట్) ఎంపిక చేసుకోవాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

అర్హత పొందాలంటే?

⦿ పీఎంజేఏవై స్కీమ్ వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ఓపెన్ చేసి 'యామ్ ఐ ఎలిజిబిల్' క్లిక్ చేయాలి.
⦿ అందులో మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అక్కడున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత 'జనరేట్ ఓటీపీ' క్లిక్ చేయాలి.
⦿ తర్వాత లబ్దిదారుడు తన రాష్ట్రం, జిల్లాలను సెలెక్ట్ చేయాలి. తర్వాత పేరు/హెచ్‌హెచ్‌డీ నంబరు/రేషన్ కార్డు నంబరు/మొబైల్ నంబరును సెర్చ్ చేయాలి.
⦿ సెర్చ్‌లో వచ్చిన ఫలితాల ప్రాతిపదికగా పీఎంజేఏవై కింద మీ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.
⦿ పీఎంజేఏవైకి అర్హత పొందారో లేదో తెలుసుకోవడానికి జాబితాలోని ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ (ఈహెచ్‌సీపీ)ని సంప్రదించవచ్చు. లేదా ఆయుష్మాన్ భారత్ యోజన కాల్ సెంటర్ నంబరు 14555 లేదా 1800-111-565కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అర్హులైనవారు తర్వాత ఈ-కార్డు పొందడానికి ప్రయత్నించాలి.
⦿ ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం రిజిస్టర్ చేసుకునేందుకు లేదా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో పది నిమిషాల్లోపే రిజిస్టర్ చేసుకుని.. ఈ కార్డును పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు, ఇ-కార్డు ప్రక్రియ

⦿ పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధరణ అయిన తర్వాత ఈ-కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు పీఎంజేఏవై దగ్గర మీ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు పరిశీలిస్తారు.
⦿ కుటుంబసభ్యుల గుర్తింపు నిర్ధరణ పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యుల జాబితా పత్రాలు కూడా చూపాలి.
⦿ అలాగే పీఎం లెటర్, ఆర్‌ఎస్‌బీవై కార్డులు కూడా చూపాలి. వీటిని పరిశీలించిన తర్వాత ఈ-కార్డు ప్రింట్ ఇస్తారు.
⦿ ఆ కార్డును ప్రత్యేకంగా ఏబీ-పీఎంజేఏవై ఐడీతో ఇస్తారు. దీన్ని భవిష్యత్తులో ఏ సందర్భంలోనైనా ప్రూఫ్‌గా వాడవచ్చు.
⦿ ఈ పథకం కింద కుటుంబ సభ్యులందరినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆడపిల్లలు, స్త్రీలు, వృద్ధులకు ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడ్డవారికి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #