అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం పథకం 2021



Agri Gold Playlist Videos Click here Video

All agrigold videos Thank you visit our youtube channel....

#

అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం పథకం 2021








update:

ఈ పథకం వివరాలు

అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేల లోపు సొమ్ము డిపాజిట్‌ చేసి.. నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 24 న ఆ మొత్తాన్ని చెల్లించనుంది.
అలాగే రూ.10 వేలులోపు డిపాజిట్‌ చేసిన బాధితులు ఎవరికైనా మొదటి విడతలో ఆ సొమ్మును అందకపోయి ఉంటే వారికి కూడా చెల్లింపులు జరుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఐడీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు.

బాధితులకు మొత్తం రూ.1,150 కోట్లు చెల్లించేందుకు గానూ 2019 అక్టోబరు 25న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3,69,655 మంది బాధితులకు 2019 నవంబర్‌లో నష్టపరిహారం చెల్లించింది.
అయితే వారిలో ఇంకా కొందరికి ఆ పరిహారం అందలేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఇటీవల స్పందిస్తూ.. వెంటనే వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులతో పాటు గతంలో రూ.10 వేల లోపు పరిహారం పొందని వారికి కూడా ఆ మొత్తం చెల్లించే అవకాశం ఉంది. ఆగస్టు 24 2021 తేదీన అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం అందించనున్నారు.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #