New WhatsApp group for Govt schemes [only for public]:
![]() |
update: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన పథకం ద్వారా రేషన్ పంపిణీ... నేరుగా రేషన్ దుకాణాల నుంచి పంపిణీ కార్యక్రమం... ఆయా జిల్లాలలో 60 నుంచి 80 శాతం పూర్తయినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. రేషన్ డోర్ డెలివరీ కొరకు మరో 5600 వాహనాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ |
𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐃𝐨𝐨𝐫 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐲 1.0 𝐚𝐩𝐩 Download appNew
𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐃𝐨𝐨𝐫 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐲 𝐂𝐨𝐧𝐬𝐨𝐥𝐢𝐝𝐚𝐭𝐞𝐝 𝐆𝐎𝐬 Download hereNew
రేషన్ డోర్ డెలివరీ పథకం అంటే ఏమిటి?
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరఫరా లో పారదర్శకతను పెంచడానికి అదేవిధంగా నేరుగా ఇంటికి రేషన్ సరఫరా చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 9260 మొబైల్ డెలివరీ వాహనాలను వినియోగించనున్నారు. ఈ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటివద్దకే రేషన్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ వాహనాలను నడపటానికి మరియు రేషన్ సరఫరా చేయడానికి గాను ఎస్సీ ఎస్టీ బిసి మరియు ఈ బీసి వర్గానికి చెందిన టువంటి యువకులకు ఉపాధి కల్పించడం జరిగింది.
రేషన్ డోర్ డెలివరీ పథకం యొక్క ముఖ్య లక్షణాలు:
-
రాష్ట్రవ్యాప్తంగా 830 కోట్ల అదనపు వ్యయంతో ప్రతి ఇంటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ.
-
రేషన్ షాపుల వద్ద క్యూలైన్లను తగ్గించడం మరియు రేషన్ సరఫరా లో మరింత పారదర్శకత పెంచడానికి ఈ పథకం పని చేస్తుంది.
-
ఈ పథకం ద్వారా రేషన్ సరఫరా చేసే సభ్యులకు ఉపాధి కలుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం 9260 వాహనాలను వినియోగిస్తుంది.
-
ఈ బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన యువకులకు ఈ రేషన్ డోర్ డెలివరీ సరఫరాకు సంబంధించి ఉపాధి కలుగుతుంది.
-
పంపిణీ చేసే బియ్యంలో మరింత నాణ్యత పెంచనున్నట్లు స్వర్ణ రకం బియ్యం పంపిణీ చేసేలా చూస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
-
సీల్డ్ బ్యాగ్ లో ఈ సరఫరా చేయడం జరుగుతుంది. డెలివరీ చేసే సమయంలో సీల్ ని తీసి నాణ్యతను లబ్ధిదారులకు చూపిస్తారు.
-
ఇంటివద్దనే ప్రజల బయోమెట్రిక్ తో ఈ సరఫరా జరగనుంది. తద్వారా బ్లాక్ మార్కెట్ కు కళ్లెం వేసే ఆస్కారం ఉంటుంది.
-
కల్తీ లకు ఆస్కారం లేకుండా నిరంతర ఆడిట్ ను ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహించనుంది.
-
రేషన్ సరుకులు పొందటానికి తిరిగి ఉపయోగించే సంచలన కూడా ప్రభుత్వం వినియోగదారులకు మొదటిసారి అందించనుంది.
-
ఈ పథకం ఫిబ్రవరి 1 నుండి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది.
AP civil supplies portal link: click here to navigate
Note: రేషన్ డోర్ డెలివరీ పథకం సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీరు ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు!